AP Cabinet Expansion : కొత్త ఏడాది.. కొత్త క్యాబినెట్‌.. కొత్త పాల‌న‌..!

ఏపీలో మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు జ‌ర‌గ‌బోతుంది. ఈనెల 15తేదీ త‌రువాత ఏ రోజైనా మంత్రివ‌ర్గంలో మార్పులు ఉండ‌బోతున్నాయి.

  • Written By:
  • Updated On - March 11, 2022 / 04:51 PM IST

ఏపీలో మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు జ‌ర‌గ‌బోతుంది. ఈనెల 15తేదీ త‌రువాత ఏ రోజైనా మంత్రివ‌ర్గంలో మార్పులు ఉండ‌బోతున్నాయి. వాస్త‌వంగా జ‌గ‌న్ సీఎం అయిన తొలి రోజుల్లో రెండున్న‌ర ఏళ్ల పాటు మాత్రమే ప్ర‌స్తుత మంత్రివ‌ర్గం ఉంటుంద‌ని చెప్పాడు. కోవిడ్ 19 కార‌ణంగా ఆరు నెల‌ల పాటు మంత్రివ‌ర్గంలో మార్పులు లేకుండా పొడిగించాడు. ప్ర‌స్తుత మంత్రివ‌ర్గం ఏర్ప‌డి ఈ ఏడాది మే నెల‌కు మూడేళ్లు అవుతుంది. ఉగాదికి కొత్త జిల్లాల నుంచి కొత్త ర‌క‌మైన పాల‌న ఉండాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. ఆ లోపు మంత్రివ‌ర్గంలోనూ మార్పులు చేయ‌డానికి జ‌గ‌న్ సిద్ధం అయ్యాడు. ఆ విష‌యాన్ని క్యాబినెట్ స‌మావేశంలో శుక్ర‌వారం స‌హ‌చ‌ర మంత్రుల‌కు తెలియ‌చేయ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ నెల 15వ తేదీన వైసీపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఆరోజున మంత్రివ‌ర్గంలోని మార్పుల గురించి మ‌రింత స్ప‌ష్ట‌త రానుంది. మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ గురించి స్వ‌యంగా జ‌గ‌న్ స‌హ‌చర మంత్రులకు తెలియ‌చేయ‌డంతో పాటు కొంద‌రు మంత్రులు కొన‌సాగుతార‌ని సంకేతం ఇచ్చాడు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనంటూ వ్యాఖ్యానించాడు. మంత్రివర్గం నుంచి తొలగించిన వాళ్ల‌ను జిల్లా ఇన్చార్జిలుగా నియ‌మిస్తాన‌ని జ‌గ‌న్ సంకేతం ఇచ్చాడు.జ‌గ‌న్ మాట‌ల ప్ర‌కారం ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమయింది. కొత్త మంత్రివ‌ర్గం త్వ‌ర‌లోనే కొలువుదీరనుంది. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్‌ డిసైడ్‌ అయ్యార‌ని తెలుస్తోంది.

Also Read : చంద్రుల‌కు ఇక చుక్క‌లే.?

ఇదే విషయాన్ని శుక్ర‌వారం జరిగిన కేబినెట్ సమావేశంలో జ‌గ‌న్ తేల్చి చెప్పాడు. మొత్తం మంత్రులను మారుస్తారని ప్రచారం జరిగినా.. కొందరిని కంటిన్యూ చేస్తున్నట్టు సీఎం జగన్ వెల్ల‌డించాడు. ఐదారుగురు మినహా మిగిలిన వాళ్ల‌ను మంత్రివ‌ర్గం నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి మంత్రివ‌ర్గంలో చోటు కోసం చాలా మంది ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాళ్లలో కర్నూలు జిల్లా నుంచి ఆర్థర్ (ఎస్పీ), బాలనాగి రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి. అనంపురం జిల్లా నుంచి ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, అనంత వెంకట్రామి రెడ్డి, కాపు రామచంద్రబారెడ్డి. కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా త‌దిత‌రులు ఉన్నారు.

గుంటూరు జిల్లా నుంచి ముస్తాఫా, మర్రి రాజశేఖర్, విడదల రజిని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, పార్థసారథి, జోగి రమేష్ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కొండేటి చిట్టిబాబు(ఎస్సీ), పొన్నడా సతీశ్, జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా నుంచి తమ్మినేని సీతారాం ఉన్నారు. అయితే తమ్మినేని సీతారం ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు.

సీనియ‌ర్ మంత్రులుగా ఉన్న బొత్సా, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని ప‌ద‌వులు ఉండే అవ‌కాశం ఉంది. మిగిలిన వాళ్ల‌ను పూర్తిగా మార్చే ఛాన్స్ ఉంది. సీనియ‌ర్లుగా ఉన్న బాలినేని, బొత్సాల‌ను కూడా చివ‌రి నిమిషంలో మార్పు చేసిన‌ప్ప‌టికీ ఆశ్చర్య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేదు. ఇటీవ‌ల ప్ర‌శాంత్ కిషోర్ త‌యారు చేసిన స‌ర్వే ఆధారంగా పనితీరును జ‌గ‌న్ బేరీజు వేశార‌ట‌. దాని ఆధారంగా మంత్రివ‌ర్గ కూర్పు ఉంటుంద‌ని టాక్‌. తొలి మంత్రివ‌ర్గంలో సామాజిక‌వ‌ర్గాలు, జిల్లాల ప్రాతిప‌దిక‌న మంత్రివ‌ర్గం ఉంది. ఈసారి కూడా అ దే. ఈక్వేష‌న్ తీసుకుంటూ ఉప ముఖ్య‌మంతుల‌ను ఐదుగుర్ని నియ‌మిస్తార‌ని తెలుస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తొలి క్యాబినెట్ కూర్పు ఉంది. ఈసారి కూడా అనూహ్య‌మైన కొత్త మొఖాల‌ను మంత్రివ‌ర్గంలో చూడొచ్చ‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ స‌మాచారం. సో..ఈ నెల 15 వ తేదీ నుంచి ఉగాది లోపుగా ఎప్పుడైనా క్యాబినెట్ కొత్త‌గా క‌నిపించ‌నుంది.