Site icon HashtagU Telugu

Vizag Capital : జగన్ విశాఖ కల, ఈ సారి బలమైన ముహూర్తం

Vizag Capital

Vizag Jagan

జగన్ విశాఖ పాలన కల నెరవేరడం లేదు. విశాఖ పీఠం స్వామి ముహూర్తం ఫలించటం లేదు. ఈ సారి ఉగాదికి బాగా గట్టి ముహూర్తం పెట్టారట. విశాఖ నుంచి పరిపాలనను ఉగాది (Ugadi) శుభ వేళలో మొదలెడతారు అని అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక మూడు ఉగాదులు అలా వచ్చి వెళ్ళిపోయాయి. మొదటి ఉగాదికి భారీ ఎత్తున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వచ్చి అంతా పాడుచేసింది. రెండవ ఉగాది నుంచి విశాఖ పాలన మీద ముహూర్తాలు పెడుతూ ఉన్నా చివరి నిముష్హంలో తప్ప్పిపోతోంది. ఈసారి ఉగాది మాత్రం జగన్ ఆశలను తీర్చేదిగా ఉందని అంటున్నారు శోభాకృత్ నామ సమత్సరం జగన్ విశాఖను పాలనా రాజధానిగా చేసుకుని పాలన మొదలెడతారు అంటునారు. అంటే ఇప్పటికి సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది.ఈ ఏడాది మార్చి నెల 22న ఉగాది వచ్చింది. అంటే ఆ రోజున జగన్ విశాఖలో ఉంటారు అని తేలుతున్న విషయం.

అదే మార్చి నెలలో 28, 29 తేదీలలో జీ 20 సదస్సు విశాఖలో (G20 Summit) జరగనుంది. ఈ సదస్సుకు జీ 20 సభ్య దేశాల నుంచి దాదాపుగా 250 మంది ప్రతినిధులు హాజరవుతారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మరో వంద మంది ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతారు. ఈ సదస్సు వేళకు జగన్ సీఎం గా (CM Jagan) విశాఖలో పాలన చేస్తూ ఉంటారని అంటున్నారు.మరో వైపు చూస్తే సుప్రీం కోర్టులో అమరావతి కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 30న ఉంది. ఈ కేసు విచారణ పూర్తి తరువాత తుది తీర్పు ఎపుడు వస్తుంది అన్నది తెలియదు. అయితే సుప్రీం కోర్టు (Supreme Court Of India) తీర్పు సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ విశాఖకు తరలించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఆ విధంగా చేయడం ద్వారా జగన్ తాను అనుకుంటున్నట్లుగా విశాఖను ఏపీకి అసలైన క్యాపిటల్ అని అందరికీ చాటి చెప్పనున్నారని తెలుస్తుంది.ముఖ్యమంత్రి విశాఖకు వస్తే మంత్రులు కూడా తమ క్యాంప్ ఆఫీసులను విశాఖలోనే ఏర్పాటు చేసుకుంటారని వారి వెంట వచ్చే అధికారులతో విశాఖ రాజధాని నగరంగా కచ్చితంగా మారుతుందని అంచనా. ఇక సచివాలయం పూర్తి స్థాయిలో విశాఖకు తరలిరావాలి అంటే సుప్రీం కోర్టులో మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు రావాల్సి ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి చూస్తే జగన్ పట్టుదలకు పట్టం కడుతూ ఉగాది నుంచి విశాఖ రాజధాని (AP Capital) హోదాను పొందుతుంది అన్న మాట. ఇక దీనికి సంబంధించి కీలక సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే నెల నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాలలో కూడా విశాఖ రాజధాని విషయం ప్రస్తావిస్తారు అని టాక్ .జగన్ విశాఖ మోజుకు ఇపుడు లాజికల్ కంక్లూషన్ కు వచ్చారట. విశాఖ నుంచి పాలన చేయాలని సీఎం గా పరిపాలనా రాజధానిగా విశాఖను ఎంచుకుని రాజ్యం చేయాలని జగన్ మూడేళ్ళుగా కలలు కంటున్నారు. ఇపుడు ఆ కలల సాకారానికి సరైన ముహూర్తం కుదిరింది అని అంటున్నారు. చూద్దాం ఇది ఫలిస్తుందా? అనేది.

Exit mobile version