Site icon HashtagU Telugu

CM Jagan : కాకినాడలో బాలిక హత్యపై సీఎం జ‌గ‌న్ ఆరా.. ద‌ర్యాప్తు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశం

Polavaram

Jagan Imresizer

కాకినాడ జిల్లా కాండ్రేగుల కురాడ గ్రామంలో జరిగిన యువతి హత్యపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దిశ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చట్టంలో పేర్కొన్న విధంగా కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిర్ణీత గడువులోగా చార్జిషీట్‌ దాఖలు చేయాలని వైఎస్‌ జగన్‌ కోరారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ రూరల్‌లో ప్రేమికుల దాడికి యువతి బలి అయిన సంగతి తెలిసిందే. కాండ్రేగుల కూరాడ గ్రామంలో సూర్యనారాయణ అనే యువకుడు దేవకి అనే యువతిని ప్రేమించాడు. కానీ దేవకి అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో దేవకిపై కోపం పెంచుకున్న సూర్యనారాయణ కరప నుంచి కూరాడకు స్కూటీపై వస్తుండగా దేవకిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.