AP Cabinet : జగన్ చెప్పిన లాజిక్కుకు ఏపీ మంత్రులకు షాక్! కర్మ సిద్దాంతం ప్రకారం..

ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ పార్టీని చూసినా దూకుడు తప్ప ఆగుడు లేదు. కానీ అలా నిలకడ లేకపోతే సీన్ మొత్తం ఒక్కోసారి రివర్స్ అవుతుంది.

  • Written By:
  • Publish Date - March 12, 2022 / 11:47 AM IST

ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ పార్టీని చూసినా దూకుడు తప్ప ఆగుడు లేదు. కానీ అలా నిలకడ లేకపోతే సీన్ మొత్తం ఒక్కోసారి రివర్స్ అవుతుంది. ఆ విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కర్మసిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. దానినే క్యాబినెట్ విస్తరణలో అనుసరించే ఛాన్సుంది. బడ్జెట్ కు ముందు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆయన.. మంత్రుల పదవీకాలంపైనా స్పష్టతనిచ్చారు. రెండున్నరేళ్ల పాటే ఈ మంత్రివర్గం ఉంటుందని.. తరువాత దానిని పునర్వ్యవస్థీకరస్తామని ముందే చెప్పారు. అంటే ఇప్పుడున్న మంత్రులను తొలగించి. వారి స్థానంలో కొత్తవారికి మంత్రులుగా అవకాశం ఇస్తారు. మరి ఇప్పటివరకు మంత్రులుగా చేసినవారిని ఏం చేస్తారు అంటే.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. మరి వారు దానికి సిద్ధమేనా?

నిజానికి ఇన్నాళ్లపాటూ మంత్రులుగా చేసినవాళ్లు ఇప్పుడు పార్టీకి సేవచేయడానికి సిద్ధమే అయినా దానికి వారు ఎంతవరకు సంసిద్దులుగా ఉంటారనేది ప్రశ్న. ఎందుకంటే మంత్రులుగా ఉంటే అధికారం ఉంటుంది. పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ తగిన గుర్తింపు లభిస్తుంది. తమ స్థాయిని పెంచుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది. అదే పార్టీ సేవ కోసం ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా.. వ్యక్తిగతంగా వారికి అది లాభించే అవకాశం తక్కువ. అందుకే ఇప్పుడు వారి రూటు ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది.

కానీ జగన్ చెబుతున్న లాజిక్ వింటే మాత్రం.. ప్రస్తుత మంత్రులే షాకవుతున్నారు. పార్టీ బాధ్యతలను చూస్తే.. రోజూ ఎక్కువమంది ప్రజలను కలుసుకోవడానికి వారికి అవకాశం లభిస్తుందన్నారు. పైగా పార్టీకి సేవ చేస్తే నాయకత్వం మెరుగవుతుందని.. పెద్ద నాయకులుగా ఎదుగుతారని అన్నారు. ఎంత ప్రజాదరణ ఉంటే అంతలా వారితోపాటు పార్టీకి కూడా ఉపయోగమని కర్తవ్యబోధ చేశారు. ఒకవేళ మంచి ఆదరణతో గెలిస్తే.. మంత్రివర్గంలో మళ్లీ ఛాన్స్ ఉంటుందని చివరిలో స్వీట్ న్యూస్ చెప్పారు. అసలు జగన్ లాంటి నాయకుడి నోటి వెంట ఈ కర్మసిద్ధాంతం ఏమిటో అర్థం కాక మంత్రులు షాకయ్యారని తెలుస్తోంది.