Site icon HashtagU Telugu

YS Jagan : వైఎస్ఆర్ పాట‌కు జ‌గ‌న్ ధిమాక్ క‌రాబు

Ysr Song

Ysr Song

ప్ర‌కాశం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి దిమ్మ‌తిరిగే పాట‌ను జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ బూచేప‌ల్లి వెంకాయ‌మ్మ వినిపించారు. ఆ పాట‌ను విన‌లేక వేదిక‌పై కూర్చొన్న జ‌గ‌న్ లేచివెళ్లి ఆమె భుజంపై చేయివేసి తీసుకొచ్చి కుర్చీలో కూర్చొబెట్టారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

https://twitter.com/sweety_000999/status/1562340344200458240

ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భా వేదిక‌పై సీఎం జ‌గ‌న్ కూర్చుని ఉండ‌గా బూచేప‌ల్లి వెంకాయ‌మ్మ దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డిపై ఓ పాట అందుకున్నారు. జ‌గ‌న్ వారిస్తున్నా, ఆమె ఆ పాట‌ను కొన‌సాగించారు. ఇక లాభంలేద‌ని జ‌గ‌న్ సూచ‌న మేర‌కు వెంకామ‌య్య కుమారుడు, ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద రెడ్డి ఆమె వ‌ద్ద‌కెళ్లి ఆమె పాట‌ను నిలిపే య‌త్నం చేశారు. అయినా వాళ్ల మాట‌ను ఆమె విన‌కుండా పాట‌ను కొన‌సాగించ‌డంతో ఉన్న‌ట్టుండి కుర్చీలో నుంచి లేచిన జ‌గ‌న్ ప‌రుగున వెంకాయ‌మ్మ వ‌ద్ద‌కు వెళ్లారు. ఆమెను త‌న రెండు చేతుల‌తో ప‌ట్టుకుని సీటు వ‌ద్ద‌కు బ‌ల‌వంతంగా తీసుకు వెళ్లారు. ఆమెకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. క్ష‌ణాల వ్య‌వధిలో జ‌రిగిన స‌న్నివేశం వైర‌ల్‌గా మారిపోయింది.