YS Viveka Murder Case: బాబాయి హత్య గురించి సీఎం జగన్‌కి ముందే తెలుసా?

వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ మేరకు సీబీఐ అవినాష్ రెడ్డిని అనుమానిస్తూ పలుమార్లు విచారించింది.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ మేరకు సీబీఐ అవినాష్ రెడ్డిని అనుమానిస్తూ పలుమార్లు విచారించింది. ఒకానొక సమయంలో అరెస్ట్ ఖాయమంటూ వార్తలు వచ్చాయి. ఈ లోగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కు అప్లయ్ చేయడం, తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి, దివంగత నేత వివేకా కుమార్తె సునీత రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. విశేషమేంటంటే సుప్రీం కోర్టులో సునీత స్వయంగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీబీఐ సేకరించిన కీలక ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని స్పష్టం చేశారు. సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ మూడు సార్లు నోటీసులిచ్చినా డుమ్మా కొట్టాడంటూ ఆరోపించారు. తల్లి అనారోగ్యం సాకుగా చూపిస్తూ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కావడం లేదని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా వైఎస్ సునీత రెడ్డి జగన్ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. అవినాష్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ యంత్రంగా తోడుగా ఉందని చెప్పారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ ను ఏపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ మద్దతు ద్వారా తన తండ్రి హత్య కేసులో ప్రధాన సాక్షులను బెదిరింపులకు గురి చేస్తున్నాడని సునీత వాదనలో తెలిపింది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసేందుకు వెళితే తన అనుచరులు అడ్డుకుంటున్నారని సునీత రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా వైఎస్ సునీత రెడ్డి సీఎం వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య సీఎం జగన్ కి ముందే తెలుసంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

Read More: Anand Mahindra: నెటిజన్స్ ని భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా పోస్ట్.. ఆ పోస్టులో ఏముందో తెలుసా?