YS Jagan Key Post to Anchor Syamala : యాంకర్ శ్యామల ( Anchor Syamala)కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి (Jagan Key Post) కట్టబెట్టారు. ఐతే కాదు పలువురు నేతలకు సైతం పలు పోస్టులు అప్పగించి మార్పులు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections 2024) వైసీపీ (YCP) ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి నుండి బయటకు వచ్చిన జగన్ (Jagan )..పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగానే యాంకర్ శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగించారు.
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈమెతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాలకి కూడా ఈ పదవి అందించినట్లు సమాచారం. అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు తెరపైకి రాగా, ఆయన వైపు కొందరు నేతలు మొగ్గు చూపకపోవడంతో వచ్చే.. వారం నెల్లూరు జిల్లాలోని నేతలందరితో కూడా సమావేశం అయ్యి, జిల్లా అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని సమాచారం. అనంతపురం జిల్లా అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ఉషాశ్రీ చరణ్, తూర్పుగోదావరి జిల్లా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మార్గాని భరత్ రామ్‌ని నియమించారు.
ఇక 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున యాంకర్ శ్యామల పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బరిలోకి దిగిన పిఠాపురం (Pithapuram) లో పర్యటిస్తూ..పవన్ ఫై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో చాలామంది ఈమెను ఇండైరెక్టుగా టార్గెట్ చేస్తూ చంపేస్తామని బెదిరించారు కూడా..అయినా వెనుకడుగు వేయలేదు. జగన్ కోసం తాను పనిచేస్తున్నాను అని, కష్టమొచ్చినా, నష్టం వచ్చినా జగన్ తోనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే నాడు పడ్డ కష్టమే నేడు ఆమెకు ప్రతిఫలం దక్కిందని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.
Read Also : Blood Type-Health Risks: మీ బ్లడ్ గ్రూప్‌ను బట్టి మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు చెప్పొచ్చు..!