జ‌గ‌న్ స‌ర్కార్ నిర్వాకం.. ఏపీపీఎస్సీలో అన‌ర్హ‌త‌..సివిల్స్ లో ర్యాంకులు

ఏపీపీఎస్సీని రాజ‌కీయ కేంద్రంగా వైకాపా మార్చేసింది. డిజిట‌ల్ మూల్యాంక‌నం పేరుతో కావ‌ల్సిన వాళ్ల‌కు ఉద్యోగాలు వ‌చ్చేలా జ‌గ‌న్ స‌ర్కార్ చేసింద‌నే ఆరోప‌ణ బ‌లంగా ఉంది. అందుకు బ‌లం చేకూరేలా ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాని నిరుద్యోగులు సివిల్స్ ఎగ్జామ్ లో ర్యాంకులు సాధించారు.

  • Written By:
  • Publish Date - September 28, 2021 / 02:21 PM IST

ఏపీపీఎస్సీని రాజ‌కీయ కేంద్రంగా వైకాపా మార్చేసింది. డిజిట‌ల్ మూల్యాంక‌నం పేరుతో కావ‌ల్సిన వాళ్ల‌కు ఉద్యోగాలు వ‌చ్చేలా జ‌గ‌న్ స‌ర్కార్ చేసింద‌నే ఆరోప‌ణ బ‌లంగా ఉంది. అందుకు బ‌లం చేకూరేలా ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాని నిరుద్యోగులు సివిల్స్ ఎగ్జామ్ లో ర్యాంకులు సాధించారు. జ‌గ‌న్ స‌ర్కార్ డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టారు. యూపీపీఎస్సీలో ర్యాంకులు సాధించిన ఆరుగురు అభ్య‌ర్థులు ఇటీవ‌ల నిర్వ‌హించిన ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాక‌పోవ‌డం జ‌గ‌న్ స‌ర్కార్ పై అనుమానాల‌ను క‌లిగిస్తోంది. డిజిట‌ల్ మూల్యాంక‌నం పేరుతో పెద్ద ఎత్తున అక్ర‌మాలు ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌లో జ‌రిగాయ‌ని స్ప‌ష్టం అవుతోంది.
గ్రూప్ 1 లో సెలెక్ట్ కాని నిరుద్యోగులు సివిల్స్ లో టాప్ ర్యాంకుల‌ను సాధించారు. వారిలో సంజ‌నా సింహ కి సివిల్స్ లో 207 ర్యాంక్ సాధించాడు. బయ్యపు రెడ్డి చైతన్య కు సివిల్స్ లో 604వ ర్యాంక్ వ‌చ్చింది. యశ్వంత్ కి సివిల్స్ లో 93 వ ర్యాంక్ , సాహిత్య కు 647 వ ర్యాంక్ ను సాధించారు. జగత్ సాయికి 32 వ ర్యాంక్, వసంత్ కుమార్ కి 170 వ ర్యాంక్ వ‌చ్చింది. ఈ ఆరుగురు నిరుద్యోగులు జ‌గ‌న్ స‌ర్కార్ నిర్వ‌హించిన గ్రూప్ 1 లో అర్హ‌త సాధించ‌లేక‌పోయారు. ఏపీ పీఎస్సీలో జ‌రిగిన అక్ర‌మాల‌పై ఈ ఆరుగురు హైకోర్టులో కేసు వేసి పోరాడుతున్నారు.
ఇటీవ‌ల జ‌గ‌న్ స‌ర్కార్ నిర్వ‌హించిన ఏపీపీఎస్సీ అక్ర‌మాల‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ పోరాడారు. ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు చాలా మంది గ్రూప్ 1 నిర్వహ‌ణ మీద అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వెలుగెత్తిచాటారు. కాన‌, జ‌గ‌న్ స‌ర్కార్ ఏమీ ప‌ట్టించుకోకుండా అయిన‌వాళ్ల‌కు డిజిట‌ల్ మూల్యాంక‌నం పేరుతో పోస్ట్ ల‌ను అమ్మేసుకుంద‌ని ఆరోపిస్తున్నారు.
మ‌ళ్లీ ఇప్పుడు విద్యారంగంలో పోస్ట్ ల‌భ‌ర్తీకి తెర‌దీసిన జ‌గ‌న్ స‌ర్కార్ ఎన్ని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుందోన‌ని నిరుద్యోగులు ఆందోళ‌న ప‌డుతున్నారు. సుమారు 15 వంద‌ల‌కు పైగా పోస్ట్ ల‌ను భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేష‌న్ ఇవ్వ‌డానికి సిద్ధం అయింది. ప్రాథ‌మిక నుంచి జిల్లా స్థాయి ఆస్ప‌త్రుల వ‌ర‌కు ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి స‌ర్కార్ సిద్ధం అయింది. నిరుద్యోగులు ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూనే..గ్రూప్ 1 మాదిరిగి నిర్వ‌హిస్తే స‌మ‌ర్థుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. సో..సివిల్స్ ఫ‌లితాలు చూసిన త‌రువాత‌నైనా గ్రూప్ 1 ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి, ఇప్పుడు జ‌రిపే వైద్య పోస్టుల ప‌రీక్ష‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని నిరుద్యోగులు కోరుతున్నారు.

Follow us