AP Politics : జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గండం?

ఏపీ ప్ర‌భుత్వం ప‌డిపోతుంద‌ని రెండేళ్ల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేపోతున్నామ‌ని ఏడాది క్రితం సుమారు 20 మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా వాయిస్ వినిపించారు.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 11:47 AM IST

ఏపీ ప్ర‌భుత్వం ప‌డిపోతుంద‌ని రెండేళ్ల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేపోతున్నామ‌ని ఏడాది క్రితం సుమారు 20 మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా వాయిస్ వినిపించారు. మంత్రివ‌ర్గం 2.0 సంద‌ర్బంగా కొంద‌రు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును మార్చ‌డంతో వైసీపీలోని కొంద‌రు గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. మూడేళ్లుగా నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న జ‌గ‌న్ పై వ్య‌తిరేక‌త సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఎప్పుడైనా బ‌య‌ట‌ప‌డ‌డానికి అవ‌కాశం ఉంద‌ని టీడీపీ భావిస్తోంది.

సుమారు 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తార‌ని మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు తాజాగా చెబుతున్నారు. ఎమ్మెల్యేల‌ను కాపాడుకోలేని ప‌రిస్థితిలో జ‌గన్మోహ‌న్ రెడ్డి ఉన్నాడ‌ని టీడీపీ విశ్వ‌సిస్తోంది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు 22 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆనాడు వ్యాఖ్యానించిన విష‌యం విదిత‌మే. వెంట‌నే అప్ర‌మ‌త్తమైన చంద్ర‌బాబు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను లాగేశారు. వాళ్ల‌లో ముగ్గురికి అప్ప‌ట్లో మంత్రి ప‌ద‌వుల‌ను కూడా ఇచ్చారు. ఇదే పెద్ద మ‌చ్చ‌గా ఆయ‌న స‌ర్కార్ కు మిగిలింది.

ప్ర‌స్తుతం 80 మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నార‌ని టీడీపీ చెబుతోంది. విశాఖప‌ట్నంలో జ‌రిగిన అక్ర‌మాలు, మూడు రాజ‌ధానులు, అమ‌రావ‌తి మ‌హాపాద‌యాత్ర , ఎన్టీఆర్ పేరు మార్పు త‌దిత‌రాల‌ను గ‌మనిస్తోన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దూరం జ‌రిగే ఛాన్స్ ఉంద‌ని దేవినేని ఊహిస్తున్నారు. ఆ విష‌యాన్ని మీడియా ముఖంగా వెల్ల‌డించ‌డం హాట్ టాపిక్ అయింది.

ఏపీ చరిత్ర‌లో 50శాతంపైగా ఓటు బ్యాంకుతో ఏర్ప‌డిన ప్ర‌భుత్వం పూర్తి కాలం కొన‌సాగ‌లేదు. ప్ర‌స్తుత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం త‌ర‌హాలోనే స్వ‌ర్గీయ ఎన్టీఆర్, పీవీలు 50శాతం పైగా ఓటు బ్యాంకును సంపాదించి ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేశారు. కానీ, వాళ్లు ఐదేళ్ల పాటు ప్ర‌భుత్వాల‌ను న‌డ‌ప‌లేక‌పోయారు. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కూడా పూర్తి కాలం కొన‌సాగే ప‌రిస్థితులు లేవ‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి చాలా కాలంగా జోస్యం చెబుతున్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరేలా దేవినేని తాజా కామెంట్స్ ఉన్నాయి.

ఇటీవ‌ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇత‌ర లీడ‌ర్ల‌తో స‌మావేశ‌మైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాళ్ల గ్రాఫ్ గురించి ప్ర‌స్తావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోని 100 మంది ప‌నితీరు బాగాలేద‌ని తేల్చేశార‌ట‌. వాళ్ల‌లో 70 మంది పనితీరు దారుణంగా ఉంద‌ని, మ‌ళ్లీ టిక్కెట్ల ఇవ్వ‌లేన‌ని సంకేతాలు ఇచ్చారు. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించుకున్న ఎమ్మెల్యేలు లేక‌పోలేదు. ఆ కోణం నుంచి దేవినేని తిరుగుబాటు వ్యాఖ్య‌లు చేశారా? లేదా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కాన్ని నిర‌సిస్తున్నారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌. ఏదేమైన‌ప్ప‌టికీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ క్ర‌మంలో ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే సాహ‌సం వాళ్లు చేస్తారాఫ‌? అనేది సందిగ్ధం.