Site icon HashtagU Telugu

YS Jagan : చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్‌ జగన్‌

YS Jagan entrusted key responsibilities to Chevireddy

YS Jagan entrusted key responsibilities to Chevireddy

YS Jagan : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) వైఎస్‌ కుటుంబానికి వీరవిదేయుడు.. జగన్ టీమ్ లో ఆయనొకరు.. అలాంటి చెవిరెడ్డికి మాజీ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు.. పార్టీలోని 25 అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ఆయన భుజాలమీద మోపారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రత్యర్దులను తన స్టాటజీతో ఇరుకున పెట్టడంతో చెవిరెడ్డికి మంచి టాలెంట్ ఉందట.. వైసీపీ హయాంలో ప్రభుత్వ విప్ గా, పార్టీలో అనుబంధ విభాగాలకు అధ్యక్షుడుగా పనిచేసిన ఆయన సేవలను వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట..అందుకోసమే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని కూడా ఆశించికుండా.. జగన్ వెంటే నడిచారు.. చివరి నిమిషంలో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.. ఈ క్రమంలో ఆయనకు పార్టీ బరువైన బాథ్యలను అప్పగించిందని టాక్ వినిపిస్తోంది..

అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతను వేరే నాయకుడికి ఇవ్వాలని పార్టీలో కొందరు జగన్ కు సూచించినా.. ఆయన మాత్రం చెవిరెడ్డి వైపే మొగ్గుచూపారట. చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన.. తర్వాత ఆయనకు ఇంత కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని ఆయన అనుచరులు కూడా ఊహించలేదట.. పార్టీలో మంచి గుర్తింపు రావడంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు చెవిరెడ్డి రెడీ అవుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.

Read Also: Auto Pay Scam : యూపీఐతో ‘ఆటో పే’ స్కాం.. తస్మాత్ జాగ్రత్త