Site icon HashtagU Telugu

YS Jagan Emotional : వైఎస్ జగన్ ఎమోషనల్…నా వల్లే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చాడు..!!

Jagan Emotional

Jagan Emotional

మేకపాటి గౌతమ్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు…నేను రాజకీయాల్లో లేకుంటే గౌతమ్ కూడా వచ్చేవాడు కాదేమో అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ్ల నెల్లూరు జిల్లాకు వెళ్లిన జగన్ ..దివంగతమంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తర్వాత గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి సంస్మరణసభలో మాట్లాడారు. గౌతమ్ తో తనకు ఉన్న బంధం గురించి గుర్తచేసుకున్నారు. గౌతమ్ మన మధ్య లేరన్న వార్త చాలా కష్టంగా ఉందన్నారు. తాను ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి గౌతమ్ తనకు మంచి స్నేహితుడని…తాను వేసే ప్రతి అడుగులో తనకు తోడుగా ఉన్నాడని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి తనకున్న సాన్నిహిత్యం గురించి మాటల్లో చెప్పలేనన్నారు. గౌతమ్ రెడ్డిని రాజకీయాల్లోకి తానే తీసుకొచ్చానని…రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు గౌతమ్ వల్లే రాజమోహన్ రెడ్డి మద్దతు తనకు లభించిందని గుర్తు చేశారు. రాజకీయాల్లో తనను ఎంతో ప్రోత్సహించారని..రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి…ఆరు శాఖలకు మంత్రి పనిచేశారని..మంచి మిత్రుడు…మంచి వ్యక్తిని తాను కోల్పోయానంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గౌతం ప్యామిలీకి పార్టీతోపాటు అంతా అండగా నిలుబడుతామని జగన్ హామిచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉదగిరి, బద్వేలు, ఆత్మకూరుకు మేలు జరుగుతుందని మే 15లోగా గౌతమ్ పేరుమీద సంగం బ్యారెజ్ ను ప్రారంభిస్తామని వెల్లడించారు.