Site icon HashtagU Telugu

YS Jagan Auto : ర‌జ‌నీ స్టైల్ `ఆటో వాలా`గా జ‌గ‌న్

Ys Jagan Auto New

Ys Jagan Auto New

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం నాలుగో విడత కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు నిధులను పంపిణీ చేస్తూ ఆటో డ్రైవర్‌గా మారారు. నివేదికల ప్రకారం 2,61,516 మంది లబ్ధిదారులకు సీఎం జగన్ రూ.2.16.5 కోట్లు పంపిణీ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆటో డ్రైవర్‌ యూనిఫాం ధరించి లబ్ధిదారుడితో కలిసి ఆటోలో కూర్చున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం లబ్ధిదారులతో సీఎం జగన్‌ మాట్లాడారు. సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ దేశంలోనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు.