Jagan Delhi Tour : మూడు రాజ‌ధానుల కోసం ఢిల్లీ

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌ళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. రెండు వారాల క్రితం హ‌స్తిన వెళ్లొచ్చిన ఆయ‌న‌ హ‌ఠాత్తుగా మ‌రోసారి ప్ర‌య‌ణం అవుతున్నారు. ఒక రోజంతా ఆయ‌న ఢిల్లీలోనే ఉంటారు. శుక్ర‌వారం రాత్రి బ‌స కూడా అక్క‌డే చేస్తారు.

  • Written By:
  • Publish Date - April 28, 2022 / 01:07 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌ళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. రెండు వారాల క్రితం హ‌స్తిన వెళ్లొచ్చిన ఆయ‌న‌ హ‌ఠాత్తుగా మ‌రోసారి ప్ర‌య‌ణం అవుతున్నారు. ఒక రోజంతా ఆయ‌న ఢిల్లీలోనే ఉంటారు. శుక్ర‌వారం రాత్రి బ‌స కూడా అక్క‌డే చేస్తారు. ఈనెల 30వ తేదీన జరగనున్న జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సహా అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరుకాబోతున్నారు. అలాగే, ఆయా రాష్ట్రాల‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. న్యాయ, కేసుల సత్వర పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. ఇదంతా అంద‌రికీ తెలిసిన అఫీషియ‌ల్ షెడ్యూల్‌.

వారాల వ్యవ‌ధిలోనే జ‌గ‌న్ మ‌రోసారి ప్రధాని న‌రేంద్ర మోడీని క‌లుసుకోనున్నారు. ఏపీ ప‌రిస్థితుల‌తో పాటు రాజ‌కీయ అంశాల‌పై వాళ్లిద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. విశాఖ పాలనా రాజధాని అంశాన్ని జగన్ ప్రస్తావించే అవకాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. క్విడ్ ప్రో కో ప‌ద్ద‌తిని అనుస‌రిస్తోన్న ఢిల్లీ బీజేపీ, ఏపీ వైసీపీ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ ఎన్నిక‌ల గురించి చ‌ర్చించుకునే అవ‌కాశం లేక‌పోలేదు.

గ‌త రాజ్య‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో అంబానీ గ్రూప్ కు రాజ్య‌స‌భ‌ను ఇప్పించ‌డంలో ఢిల్లీ బీజేపీ కీల‌క భూమిక పోషించింది. ఆ పార్టీ ఆదేశం మేర‌కు ప‌రిమ‌ళ న‌త్వానికి రాజ్య‌స‌భ ను వైసీపీ నుంచి ఇవ్వ‌డం జ‌రిగిందని స‌ర్వ‌త్రా తెలిసిన అంశ‌మే. మ‌రో నెల రోజుల్లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆదానీ గ్రూప్ కు ఈసారి రాజ్య స‌భ‌ను ఇవ్వాల‌నే కండిష‌న్ వైసీపీ మీద బీజేపీ ఉంచే అవ‌కాశం ఉంది. అంతేకాదు, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌ద్ధ‌తును కూడా వైసీపీ నుంచి మోడీ కోర‌తార‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటూ ఇటీవ‌ల వైసీపీ మీద మీడియాలో చ‌ర్చ జ‌రిగింది. ఆ మేర‌కు ప్ర‌శాంత్ కిషోర్ త‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ లో సోనియాకు చెప్పార‌ని ఫోక‌స్ అయింది. అంతేకాదు, టీఆర్ఎస్ ప్లీన‌రీలో కేసీఆర్ వినిపించిన జాతీయ ఎజెండాపై కూడా మోడీ, జ‌గ‌న్ మ‌ధ్య ప్ర‌స్తావ‌న‌కు రానుంద‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రల్లోని రాజ‌కీయ‌ప‌ర‌మైన అంశాల‌పై మోడీ, అమిత్ షా గురి పెట్టారు. ఆ క్ర‌మంలో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు, జ‌గ‌న్ మ‌ద్ధ‌తును ఆ పార్టీ తీసుకోనుంద‌ని తెలుస్తోంది. ఇలాంటి రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌తో పాటు ఏపీలోని ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌స్తార‌ని స‌మాచారం.

ఈసారి ఢిల్లీ టూర్లో మూడు రాజ‌ధానుల అంశంపై క్లారిటీ రానుంది. అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతోన్న జ‌గ‌న్ మ‌రోసారి బిల్లును అసెంబ్లీలోకి తెచ్చే అవ‌కాశం ఉంది. ఆ విష‌యంపై మోడీ వ‌ద్ద అనుమ‌తి తీసుకుని జ‌గ‌న్ ముందుకెళుతార‌ని తెలుస్తోంది. మొత్తం మీద ఈసారి జ‌గ‌న్ ఢిల్లీ టూర్ బీజేపీ, వైసీపీ బంధాన్ని మ‌రింత పెంచుకునేలా క్విడ్ ప్రో కో ఆ రెండు పార్టీ మ‌ధ్య న‌డ‌వ‌నుంది.