Site icon HashtagU Telugu

AP Politics : 100 మంది సిట్టింగ్ ల‌కు టిక్కెట్ డౌటే!

Jonnagaladda Padmavathi

Jonnagaladda Padmavathi

ప‌ది మంత్రులు, డ‌జ‌ను మంది ఎమ్మెల్యేల‌కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ప‌రోక్షంగా 70మందికి పైగా ఎమ్మెల్యేల‌కు షాక్ ఇచ్చేలా న్యూస్ చెప్పార‌ట‌. ఆ విష‌యాన్ని ఆ పార్టీ లీడ‌ర్ జొన్న‌ల గ‌డ్డ ప‌ద్మావ‌తి ట్వీట్ట‌ర్ వేదిక‌గా ప‌రోక్ష‌ సంకేతాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఆమె ట్వీ్ట్ట‌ర్ పేజీలోని పోస్టింగ్ ను గ‌మ‌నిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో 100 మంది సిట్టింగ్ ల‌కు వైసీపీ టిక్కెట్ వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేద‌ని ప‌రోక్షంగా బోధ‌ప‌డుతోంది.

`ప‌నిచేసే వాళ్ల‌కే టిక్కెట్ త‌న‌పై అలిగినా ప‌ర్వాలేదు..` అంటూ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం వ‌ర్క్ షాపులో వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లోని ఆంత‌ర్యాన్ని గ‌మ‌నిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు ద‌డ మొద‌లైయింది. అంతేకాదు, వ‌ర్క్ షాపు సంద‌ర్భంగా నిర్మోహ‌మాటంగా ప్రోగ్రెస్ రిపోర్టును ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ అంద‌చేశార‌ని చెబుతున్నారు. అయితే, ఎవ‌రికి ఎన్ని మార్కులు వేశారో, రెండో వాళ్ల‌కు తెలియ‌దు. ఎవ‌రికి వారే సీక్రెట్ గా ఉంచారు. పైకి మాత్రం పాస్ మార్కుల్లో ఉన్నామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ వంద మందికి పైగా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఆశాజ‌న‌కంగా లేద‌ని తెలుస్తోంది.

గ‌త రెండు నెల‌లుగా `గ‌డ‌ప‌గ‌డ‌పకు మ‌న ప్ర‌భుత్వం` కార్య‌క్రమం జ‌రుగుతోంది. అందులో భాగంగా మంత్రి నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కు గ్రామాల‌కు వెళ్లాలి. ప్ర‌తి గ‌డ‌ప‌ను తొక్క‌డంతో పాటు జ‌గ‌న్ స‌ర్కార్ గ‌త మూడేళ్లుగా చేసిన ప‌నుల గురించి తెలుసుకోవాలి. ప్ర‌భుత్వంపై ఒక వేళ వ్య‌తిరేక‌త ఉంటే న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేయాలి. ఆ దిశ‌గా దిశానిర్దేశం చేసిన జ‌గ‌న్ ఆదేశంకు అనుగుణంగా ముందుకు క‌దిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు స‌గం మంది కూడా లేర‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్. వ‌ర్క్ షాపు సంద‌ర్భంగా జ‌గ‌న్ ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ లోనూ అత్తెస‌ర మార్కుల‌తో కొంద‌రు ఉంటే, సింహ‌భాగం ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ స్టేజ్ లో ఉన్నార‌ని తెలుస్తోంది.

ప‌ది మంత్రులు, మాజీ మంత్రులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు దూరంగా ఉన్నార‌ని వ‌ర్క్ షాపులో తేల్చార‌ని ప్ర‌చారం జరుగుతోంది. తొలి రోజుల్లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం ప్రోగ్రామ్ కోసం వెళ్లిన సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించారు. దీంతో వ్యూహాత్మ‌కంగా ప్ర‌జ‌ల‌కు అంటీముట్ట‌న‌ట్టు ఉంటూ కాలం వెళ్ల‌తీశారు. ఆ విష‌యాన్ని స‌ర్వే ద్వారా నిఘా కళ్లు ప‌ట్టేశాయ‌ట‌. అందుకే, ఎవ‌రు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లారు? ఎవ‌రు దూరంగా ఉన్నారు? అనే విష‌యాన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా జ‌గ‌న్ తేల్చాశార‌ని టాక్. అంతేకాదు, అలిగిన‌ప్ప‌టికీ గ్రాఫ్ ప‌డిపోయిన వాళ్ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌న‌ని క‌రాఖండిగా చెప్పేశారు జ‌గ‌న్‌.

రెండు నెల‌ల క్రితం రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్లు, జిల్లా అధ్య‌క్షులు, జోన‌ల్ ఇంచార్జిల‌తో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీటింగ్ పెట్టారు. ఆ త‌రువాత ప్లీన‌రీ జ‌రిగిన ప్లీన‌రీ విజ‌య‌వంతం అయింది. గ్రామ‌, మండ‌ల‌, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జ‌రిగిన ప్లీన‌రీతో `గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం` కార్య‌క్ర‌మాన్ని ముగించిన‌ట్టు అయింది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఎవ‌రికి ఎన్ని మార్కులు వ‌చ్చాయో సోమ‌వారం ప్రెష్ లిస్ట్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌య‌ట‌పెట్టార‌ట‌. దాని ప్ర‌కారం కొంద‌రు మంత్రులు, మాజీ మంత్రుల‌తో స‌హా క‌నీసం 100 మందికి టిక్కెట్లు డౌట్ గా వైసీపీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ప్ర‌భుత్వం గ్రాఫ్ బాగుందని, కేవ‌లం కొంద‌రు ఎమ్మెల్యేల గ్రాఫ్ దారుణంగా ఉంద‌ని జ‌గ‌న్ ఫోక‌స్ చేయ‌డం ఆ పార్టీని వెంటాడుతోన్న అంశం. దానికి ఎలా ఫుల్ స్టాప్ ప‌డుతుందో చూడాలి.