వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan), పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు (Nagamalleshwara Rao) కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కంటే నియంత్రణలే మిగిలాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసి, అవమానించారని ఆరోపించారు.
Indigo Flight Gate Locked: మరో విమానంలో సాంకేతిక లోపం.. ఆ సమయంలో ప్లైట్‌లో మాజీ సీఎం!
టీడీపీకి అనుకూల ఫలితాల తర్వాత నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి జరిగిందని, ఊరు వదిలిపెట్టు అన్న బెదిరింపులు వచ్చాయని చెప్పారు. పోలీసులు రౌడీషీట్ తెరుస్తామని బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి లోనై నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. తండ్రి ఎంతో ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అతని భార్య, కూతురు ఇప్పటికీ తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని చెప్పారు.
పోలీసు వ్యవస్థ కుల ఆధారితంగా పని చేస్తోందని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీలో ఉన్న కమ్మవారిని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టారని ఆరోపించారు. లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను డీఎస్పీ కులంపై అవమానించడంతో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. దేవినేని అవినాష్, కొడాలి నాని, తలశిల రఘురాం, బ్రహ్మనాయుడు, పోసాని కృష్ణ మురళి వంటి నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పోలీసులు, మీడియా కలిసి కుట్ర చేస్తోందని హెచ్చరిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.