Site icon HashtagU Telugu

Sankranti Sentiment : సంక్రాంతి నుంచి జనంలోకి జగన్, కేసీఆర్ .. సెంటిమెంట్ కలిసొచ్చేనా ?

Sankranti Sentiment 2025 Ys Jagan Kcr Public Meet Tour

Sankranti Sentiment : వచ్చే సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ రాబోతోంది. ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రత్యేకమే.  ఈ పర్వదినాన్ని వేదికగా చేసుకొని  తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రజలతో మమేకం అయ్యేందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలోని అధికార టీడీపీని ఎండగట్టడానికి జగన్.. తెలంగాణలోని అధికార కాంగ్రెస్‌ను ఎండగట్టడానికి కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి దూకబోతున్నారు. ఇందుకోసం రెండు పార్టీల క్యాడర్ ముమ్మర సన్నాహాలు  చేస్తోంది. దీంతో  సంక్రాంతి పండుగ నుంచి తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ రాచుకోనుంది.

Also Read :Delhi Super Power : షిండే వెనుక ‘సూపర్ పవర్’.. ఫడ్నవిస్‌‌ సీఎం కాకుండా అడ్డుకునే కుట్ర

కేసీఆర్ పర్యటనల టార్గెట్ ఇదీ.. 

‘జనంతో కలవరు’(Sankranti Sentiment) అనే నెగెటివ్ ముద్రను తొలగించుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అడుగులు వేయబోతున్నారు. కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండటం అనే అంశం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి దారితీసింది. ఈ మిస్టేక్ ఇకపై జరగకుండా చూసుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారట. సంక్రాంతి నుంచి ఆయన జనం బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని అంటున్నారు. అయితే ఆయన టూర్ వివరాలతో ముడిపడిన నిర్దిష్టమైన తేదీ వివరాలను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇంకా వెల్లడించలేదు. కేసీఆర్ రంగ ప్రవేశంతో బీఆర్ఎస్ క్యాడర్‌కు పునరుత్తేజం వస్తుందని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : Human Washing Machine : మనిషిని ఉతికి ఆరేసే ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’‌

జనంతో మమేకం కానున్న జగన్

ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ పార్టీ వైఎస్సార్ సీపీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ సీపీకి టీడీపీ – జనసేన – బీజేపీలతో కూడిన కూటమి నుంచి టఫ్ ఫైట్ ఎదురవుతోంది. వాటన్నింటిని ఏకకాలంలో కౌంటర్ చేస్తూ.. జనంతో మమేకం కావాలని జగన్ భావిస్తున్నారు. మరోవైపు చెల్లెలు షర్మిల చేస్తున్న విమర్శలనూ ఆయన తనదైన శైలిలో తిప్పికొట్టనున్నారు.  వైఎస్సార్ సీపీ హయాంలో తీసుకున్న చాలా నిర్ణయాలపై టీడీపీ ప్రభుత్వం విచారణలు నిర్వహిస్తోంది. ఆయా అంశాలపై ప్రజలకు ఏర్పడిన సందేహాలను క్లియర్ చేసేలా జగన్ ప్రసంగాలు ఉంటాయని అంటున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగిన ప్రస్తుత తరుణంలో.. పార్టీ క్యాడర్‌లో భరోసాను నింపే ప్రయత్నాన్ని జగన్ చేయనున్నారు. మొత్తం మీద సంక్రాంతి సెంటిమెంటుతో మొదలుపెడుతున్న రాజకీయ యాత్రలు కేసీఆర్, జగన్‌లకు ఎంతమేర కలిసొస్తాయో వేచిచూడాలి.