YS Avinash Reddy: విషమంగా అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం

అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ఆమెకు గత నాలుగు రోజులుగా వైద్యం అందిస్తున్నారు.

YS Avinash Reddy: అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ఆమెకు గత నాలుగు రోజులుగా వైద్యం అందిస్తున్నారు. తాజాగా శ్రీలక్ష్మి హెల్త్ బులిటెన్ ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం విషమంగానే ఉందని, అత్యవసర చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గుండె నాళాలలో కొంత ఇన్ఫెక్షన్ కు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి కర్నూల్ విశ్వభారతి ఆస్పత్రిలో తల్లితోనే ఉన్నారు.

ఇదిలా ఉండగా అవినాష్ రెడ్డి కోసం సీబీఐ ఎదురుచూస్తుంది. ఈ ఉదయం సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి కోసం కర్నూల్ వెళ్లారు. అనంతరం విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అంతకుముందు స్థానిక జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారులు మాట్లాడారు. అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరించాల్సిందిగా, లొంగిపోవాలని చెప్పమని సీబీఐ ఎస్పీని కోరినట్టు విశ్వసనీయ సమాచారం. మరో విశేషం ఏంటంటే అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోబోతున్నామని లిఖిత పూర్వకంగా జిల్లా ఎస్పీకి అందజేసినట్లు సమాచారం అందుతుంది.

అవినాష్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఓ వైపు సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విశ్వభారతి ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఏ క్షణమైనా అవినాష్ ని సీబీఐ కస్టడీకి తీసుకోబోతుందనే కథనాలు వెలువడుతుండటంతో అవినాష్ రెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కాగా ఇప్పటికే ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద హైటెన్షన్ కొనసాగుతుంది.

Read More: Tammineni Sitaram: అవినాష్ అరెస్ట్ సీబీఐ చూసుకుంటుంది!