Site icon HashtagU Telugu

You Tube Academy : ఏపీలో యూట్యూబ్‌ అకాడమీ : సీఎం చంద్రబాబు

YouTube Academy in AP: CM Chandrababu

YouTube Academy in AP: CM Chandrababu

YouTube Academy :  ఆంధ్రప్రదేశ్‌ (AP)లో పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సర్కార్‌ ఏర్పడిన నాటి నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టిసారిస్తున్నారు. ఇక, ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ అడుగుపెట్టనుంది.. ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటు కాబోతోంది.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపిన విషయాన్ని ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆన్ లైన్‌లో యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపినట్లుగా ట్వీట్‌ చేశారు.. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో సమావేశమయ్యాను. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆహ్వానించాం. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడమీలో పరిశోధనలు చేయవచ్చు అన్నారు.. అందుకే అమరావతిలో భాగమైన మీడియా సిటీలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయమని కోరినట్టు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునర్ నిర్మాణంపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు.. మరోవైపు.. ప్రతిష్టాత్మక సంస్థలను కూడా ఆ రాజధానికి రప్పించే విధంగా ప్రయత్నాలు సాగిస్తోన్న విషయం తెలిపిందే.

Read Also:Infinix Note 40X 5G: ఇన్ఫినిక్స్ నుంచి మరో 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల.. ప్రత్యేకతలు ఇవే!