క్రికెట్ బెట్టింగ్ మోజులో యూత్.. పేరెంట్స్ బీ అలర్ట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మోజులో పడుతున్నారు. వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్, రంజీ మ్యాచ్లపై కూడా యువత విచ్చలవిడిగా బెట్టింగ్లకు పాల్పడుతుంది.

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 11:32 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మోజులో పడుతున్నారు. వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్, రంజీ మ్యాచ్లపై కూడా యువత విచ్చలవిడిగా బెట్టింగ్లకు పాల్పడుతుంది. అయితే ఈ బెట్టింగ్ల్లో అప్పులు చేసి లక్షల రూపాయలు పోగొట్టుకుని వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తిరుపతిలో ఇంజనీరంగ్ సెంకడ్ ఇయర్ చదువుతున్న ఓ యువకుడు ఐపీఎల్లో రూ.15 లక్షలను పోగొట్టుకున్నాడు. తన తల్లిదండ్రులకు తెలియకుండానే వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బును తెచ్చి వారికి ఎలా తిరిగి చెల్లించాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఆ యువకుడి తల్లి తిరుపతిలోని ఓ యునివర్సిటీలో పని చేస్తుండగా…తండ్రి అధికార పార్టీలో క్రియాశీల నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్,మెడికల్,ఇతర కోర్సులు చేస్తున్న బడా బాబుల పిల్లలు ఈ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు.వీరిని చూసి మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు కూడా బెట్టింగ్లకు పాల్పడుతూ అప్పులు తీర్చలేక తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈజీ మనీ కోసం చాలా మంది అమాయక విద్యార్థులు బుకీల వలలో పడి
లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు.దీంతో కొంతమంది యువకులు ఇళ్ల నుంచి పరారీ అవుతుండగా…మరికొంత మంది సంఘ విద్రోహులుగా మారుతున్నారు.

నగరంలో ఓ వ్యాపారవేత్తకు చెందిన కుమారుడు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. అయితే వడ్డీ వ్యాపారి దగ్గర తన కుమారుడు అప్పు తీసుకోవడంతో ఆ వడ్డీ వ్యాపారి ఒత్తిడి చేయడంతో ఆను కూడా రెండు లక్షల రూపాయలు చెల్లించానని వాపోయాడు. తమ పిల్లల కార్యకలాపాలపై దృష్టి పెట్టడం తల్లిదండ్రులు ప్రధాన బాధ్యతని ఆయన తెలిపారు. చాలా మంది తల్లిదండ్రులు కాలేజీ, ట్యూషన్ ఫీజులు చెల్లించిన వెంటనే చేతులు దులిపేసుకుని…తమ బాధ్యత అయిపోందని భావిస్తారు. అయితే చెడు వ్యసనాలకు బానిసైన తమ కుమారుడి చదువు చెడిపోవడమే కాకుండా భవిష్యత్లో తమ డబ్బులు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.

ఐపీఎల్, టీ20, ప్రపంచకప్ లో క్రికెట్ బెట్టింగ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. క్రికెట్ బుకీలను పట్టుకునేందుకు
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తిరుపతి అర్బన్ పరిధిలోని క్రికెట్ బుకీల సమాచారాన్ని పొందడానికి ట్రాఫిక్, క్రైమ్ సబ్ డివిజన్లతో పాటు ఐదు సబ్ – డివిజన్ల పరిధిలోని మొత్తం 25 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు. ఈజీ మని మోజులో పడి చాలా మంది అమాయక యువకులు క్రికెట్ బెట్టింగ్లకు బలి అవుతున్నారని….ఇప్పటికే తాము బెట్టింగ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బెట్టింగ్లో దొరికిన వారిపై గ్యాంబ్లింగ్ చట్టం ప్రకారం అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపుతామని ఆయన
హెచ్చరించారు. విద్యాసంస్థల్లో చేరిన తర్వాత తల్లిదండ్రులను వారి ఇష్టానికి వదిలివేయకుండా వారి కార్యకలాపాలపై నిఘా ఉంచడంలో తల్లిదండ్రుల బాధ్యతను కూడా ముఖ్యమని ఎస్పీ తెలిపారు. వారిపై గట్టి నిఘా ఉంచడం వల్ల బెట్టింగ్లు, నిషేధిత మాదకద్రవ్యాల వినియోగం వంటి వాటికి ఆకర్షితులవకుండా నిరోధించవచ్చని ఆయన సూచించారు.