Site icon HashtagU Telugu

Red Book : రెడ్ బుక్లో తర్వాత మీ పేరే ఉందటగా..? కొడాలి నాని రియాక్షన్

Kodali Nani Redbook

Kodali Nani Redbook

రెడ్ బుక్ (Red Book) ఈ పేరు వింటే చాలు వైసీపీ నేతల్లో వణుకుడు పుడుతుంది. అధికార మదంతో వైసీపీ నేతలు ఐదేళ్ల పాటు ఎన్ని అరాచకాలు..ఎన్ని దౌర్జన్యాలు..ఎన్ని హత్యలు..ఎన్ని అక్రమ కేసులు పెట్టారో తెలియంది కాదు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ను సైతం జైల్లో పెట్టించారు. పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో , నేతను రోడ్ల మీదకు వచ్చి నిరసన చేసేలా చేసారు. ఇక టీడీపీ, జనసేన శ్రేణులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేదించారో తెలియంది కాదు. సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్ని బూతులు అన్నారో..అనిపించారో కూడా తెలియంది కాదు. ఇన్ని చేసిన వీరిని నారా లోకేష్ బదులు తీర్చుకోకుండా ఉంటాడా..? అందరి లెక్క సరిచేసి..ఎలాంటి శిక్షలు వేయాలో..ఏ రేంజ్ లో వేయాలో అన్ని సిద్ధం చేయడమే కాదు..ఆ పని కూడా మొదలుపెట్టాడు.

BCCI: టీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గుడ్ న్యూస్‌.. ఫ్యామిలీని తీసుకెళ్లొచ్చు!

వైసీపీ నేతల పాపాలన్నిటిని రెడ్ బుక్ లో రాసుకొని..ఒక్కొక్కర్ని జైలు కు తరలిస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు కేసుల్లో జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కూడా జైలు జీవితం గడుపుతున్నాడు. ఈరోజు జగన్ (Jagan) తో పాటు పలువురు వైసీపీ నేతలు వంశీ ని కలిశారు. మొన్నటి వరకు కనిపించకుండా ఉన్న కొడాలి నాని (Kodali Nani) సైతం ఈరోజు జైలు వద్దకు వచ్చి వంశీని పరామర్శించారు. నాని ని చూసిన మీడియా వారు.. ‘రెడ్ బుక్లో తర్వాత మీ పేరే ఉందటగా? మీపై 3 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు’ అని నాని ని ప్రశ్నించగా ‘నేను రెడ్ బుక్ చూడలేదు. మీరు చూశారా? మూడు కాకుంటే 30 కేసులు పెట్టుకోనివ్వండి. అరెస్టులు చాలా చిన్న విషయాలు. అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా మాట్లాడాం. పదవి లేనప్పుడు ఏం మాట్లాడాలి?’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బయటకు చెప్పినప్పటికీ నాని లో భయం పట్టుకుందని అంత అంటున్నారు. ఏది ఏమైనప్పటికి రాష్ట్రంలో రెడ్ బుక్ వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తుంది.