Kondapalli Srinivas : యావత్ తెలుగు జాతికి గర్వకారణం తెలుగుదేశం పార్టీ. యావత్ తెలుగు జాతి గర్వించే సామాజిక యోధుడు అన్న ఎన్‌టీఆర్. ప్రజాసంక్షేమం కోసం ఆ మహనీయుడు ఏర్పాటు చేసిన రాజకీయ వేదికే టీడీపీ. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. పల్లె నుంచి పట్నం దాకా జయహో టీడీపీ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. యువ మంత్రి, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలు గ్రాండ్‌గా జరిగాయి. ఇందులో పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
Also Read :Anam Mirza : సానియా మీర్జా సోదరి ‘దావతే రంజాన్’లో కాల్పుల కలకలం
మంత్రి పిలుపుతో.. అన్ని గ్రామాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలు
స్థానిక టీడీపీ నేతలతో స్వయంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas).. పార్టీ బలోపేతం కోసం ఎలా ముందుకు సాగాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోనూ టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలను గ్రాండ్‌గా నిర్వహించాలని పార్టీ క్యాడర్‌కు మంత్రి సూచించారు. ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలు, నేతలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలను ఏర్పాటు చేశారు. తద్వారా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు యత్నించారు. తాను హాజరు కాలేకపోయినా.. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించిన కార్యకర్తలు, నాయకులతో స్వయంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్‌లో మాట్లాడారు. వారిని అభినందించారు. కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలు కూడా.. మంత్రి పిలుపుతో మళ్లీ లైన్‌లోకి వచ్చారు. టీడీపీ జెండాతో జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు.
Also Read :Jagga Reddy Movie: నాపై ఎన్నో కుట్రలు.. నా జీవిత పోరాటాన్ని సినిమాలో చూపిస్తా : జగ్గారెడ్డి
యావత్ ఉత్తరాంధ్రలో..
ఇక ఉత్తరాంధ్రలో ఇతర నాయకులు సైతం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల రక్తదాన శిభిరాలు, సామూహిక అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్నాయి. మంత్రులు సైతం తమ తమ నియోజకవర్గాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సైతం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.