Site icon HashtagU Telugu

Male Tiger Spotted : నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR)లో పెద్ద పులి హల్చల్

Tiger Attack IN Kumuram Bheem Asifabad

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR)లో తాజాగా ఓ యువ పెద్దపులి (Male Tiger) హలచల్ చేసింది. నార్మల్ పట్రోలింగ్ సమయంలో అటవీ సిబ్బంది వెళ్తుండగా..రోడ్ మధ్య లో పులి కనిపించింది. దీంతో వారు తమ వాహననాన్ని పక్కకు నిలిపి , ఫోన్ కెమెరా తో పులి దృశ్యాలను కెమెరాలో బంధించారు. పులి తన ప్రాంతాన్ని గుర్తు చేసుకునేందుకు మూత్రం స్ప్రే చేస్తూ కనిపించింది. ఇది పులులకు సహజమైన ప్రవర్తన. ఈ విధంగా పులులు తమ హద్దులను సెట్ చేస్తూ, ఇతర పులులకు తమ సత్తా చూపిస్తాయి.

ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగులుటి రేంజ్‌లో, VRSP డ్యామ్ మరియు శివాలయం సమీపంలో నీటి వనరులు ఉండడంతో పాటు, ఎల్లప్పుడూ జీవవైవిధ్యానికి ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారింది. దీనిలో మూడు పులులు, ఒక యువ మగ పులితో పాటు రెండు ఆడ పులులు నివసిస్తున్నాయని తెలిపారు. 2018లో ఇక్కడ 68 పులులు ఉన్న ఇప్పుడు 90-95 పులుల సంఖ్యకు చేరుకున్నదని, 2025 నాటికి ఈ సంఖ్య 100 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యం(ఎన్ఎస్టీఆర్) (Nagarjunsagar-Srisailam Tiger Reserve) దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో ఒకటిగా పేరుగాంచింది. నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం పల్నాడు జిల్లా అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పులుల సంఖ్య పెంచడంపై ఎప్పటి నుండో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించారు. దీని ఫలితంగా గత కొంతకాలంగా నల్లమల అటవీ ప్రాంతంలో పులల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ 3568 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఎన్ఎస్టిఆర్ పరిధిలో పల్నాడు జిల్లాలో ఈ మధ్య కాలంలో పులులు తరచు కనిపిస్తున్నాయి. దీంతో అటవీ శాఖాధికారులు వాటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Read Also : Lucky Person : అదృష్టం అంటే అతడిదే పో..భార్యలు 4 ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు లేవు