AP Minister Appalaraju: మహిళలకు అప్పలరాజు శాపనార్థం!

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల మంత్రి సీదిరి అప్పలరాజు

Published By: HashtagU Telugu Desk
Appalaraju

Appalaraju

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం ఏపీలోని వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర గ్రామాల్లో పర్యటించారు. ఆయన పలు ఇళ్లను సందర్శించి,  ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సామాజిక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వివరించారు. కొందరు మహిళలకు ఆసరా పింఛన్లు, వైఎస్ఆర్ చేయూత, ఇంకా అనేక పథకాలు అందుతున్నాయని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చేలా మహిళలను ఆకట్టుకోవాలని అప్పలరాజుకు నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించకుంటే మీరు శాపనార్థాలకు గురవుతారు’’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి. ముఖ్యమంత్రి వైఎస్‌. మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల ఆశీస్సులు తీసుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి భిన్న స్పందన వస్తోంది.

  Last Updated: 02 Aug 2022, 06:17 PM IST