Kadapa University: జ‌గ‌న్ వింత పోక‌డ‌, `యోగి వేమ‌న‌`కు అవ‌మానం!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అడ్డ‌గోలు ప‌రిపాల‌న‌కు నిద‌ర్శ‌నం యోగి వేమ‌న విగ్ర‌హం తొలగింపు. హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్ర‌జా క‌వి యోగి వేమ‌న విగ్ర‌హాన్ని క‌డ‌ప‌లోని యోగి వేమ‌న యూనివ‌ర్సిటీ నుంచి తీసివేశారు. మ‌హ‌నీయులు, స్పూర్తి ప్ర‌దాత‌లు, ఆద‌ర్శవంతుల విగ్ర‌హాల‌ను తొలగిస్తూ స్వ‌ర్గీయ వైఎస్ విగ్ర‌హాల‌ను వాటి స్థానంలో పెట్టించ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `రివ‌ర్స్` ఆలోచ‌న‌కు ప‌రాకాష్ట‌గా నిలుస్తోంది. అందుకే విద్యార్థి లోకం తిర‌గ‌బ‌డుతోంది.

  • Written By:
  • Updated On - November 10, 2022 / 01:05 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అడ్డ‌గోలు ప‌రిపాల‌న‌కు నిద‌ర్శ‌నం యోగి వేమ‌న విగ్ర‌హం తొలగింపు. హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్ర‌జా క‌వి యోగి వేమ‌న విగ్ర‌హాన్ని క‌డ‌ప‌లోని యోగి వేమ‌న యూనివ‌ర్సిటీ నుంచి తీసివేశారు. మ‌హ‌నీయులు, స్పూర్తి ప్ర‌దాత‌లు, ఆద‌ర్శవంతుల విగ్ర‌హాల‌ను తొలగిస్తూ స్వ‌ర్గీయ వైఎస్ విగ్ర‌హాల‌ను వాటి స్థానంలో పెట్టించ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `రివ‌ర్స్` ఆలోచ‌న‌కు ప‌రాకాష్ట‌గా నిలుస్తోంది. అందుకే విద్యార్థి లోకం తిర‌గ‌బ‌డుతోంది.

కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2006లో కడపలో యోగి వేమన యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. రాయలసీమలో విద్యార్ధులకు, ముఖ్యంగా కడప జిల్లాలో విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుందని భావించారు. ప్రజా కవి అయిన యోగి వేమన పేరుతో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన విగ్రహం కూడా అందులోపెట్టించారు. భవిష్యత్ తరాలు యోగి వేమ‌న ను మర్చిపోకుండా ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్ తన సొంత జిల్లాలో యోగి వేమన కంటే వైఎస్సార్ గొప్ప అన్నట్లుగా విగ్రహాన్ని మార్చేయ‌డం సీఎం విప‌రీత ధోర‌ణికి అద్దం ప‌డుతోంది.

యోగి వేమన యూనివర్శిటీలో ఉన్న వేమన విగ్రహం స్ధానంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తాజాగా ప్రతిష్టించారు. యూనివర్శిటీ యోగి వేమన పేరుతో ఉండ‌గా ఆయ‌న‌ విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహాన్ని పెట్ట‌డం విడ్డూరంగా ఉంది. హ‌ఠాత్ప‌రిణామాన్ని గ‌మ‌నించిన విద్యార్ధులు, ప్రజాసంఘాలు, విప‌క్షాలు ఆగ్ర‌హిస్తున్నాయి. విద్యార్ధి సంఘాలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారు. రాయలసీమ విద్యార్ధి సమాఖ్యతో పాటు ఇతర విద్యార్ధిసంఘాలు కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేయ‌డానికి ముందుకొచ్చారు. ఇలాంటి చ‌ర్య దుర్మార్గమని సీపీఐ రామకృష్ణ విమ‌ర్శించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు తప్ప రాష్ట్రంలో ఏ విగ్రహాలు ఉండకూడదా? అని ఆయన ప్రశ్నించారు. యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

ఏపీలో మహనీయుల పేరుమార్పు, విగ్రహాల తొలగింపు పర్వం కొన‌సాగింపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద అస‌హ‌నాన్ని క‌లిగిస్తోంద‌ని మేధావులు అంటున్నారు. ఇప్పటికే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై వివాదం కొనసాగుతుండగా, తాజాగా కడపలోని యోగి వేమన యూనివర్శిటీలో ఏకంగా వేమన విగ్రహాన్నే తొలగించి మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టడం కలకలం రేపుతోంది. దీనిపై జ‌న‌సేనాని ప‌వ‌న్ ఆ జిల్లాకు వెళ్లి విద్యార్థుల‌కు మ‌ద్ధ‌తుగా నిల‌వాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇంకో వైపు లోకేష్ కూడా క‌డ‌ప యూనివ‌ర్సిటీకి వెళ్లాల‌ని యోచిస్తున్నారు. గుంటూరు జిల్లా ఇప్ప‌టం గ్రామంలో వైఎస్ విగ్ర‌హాన్ని ఏ విధంగా తొలగించారో, అదే త‌ర‌హాలో క‌డ‌ప‌లోని యోగి వేమన యూనివ‌ర్సిటీలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్ర‌హాన్ని తొలిగించి య‌థాత‌దంగా వేమ‌న విగ్ర‌హాన్ని పెట్ట‌డానికి విప‌క్షాలు, ప్ర‌జా, పౌర సంఘాలు ముందుకు క‌దులుతున్నాయి. ఈ ప‌రిణామం ఎటు వైపు దారితీస్తుందో చూడాలి.