Yogendranath Posani : పోసాని కి భారీ షాక్..

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని.. ఆయన ముందుచూపు ఏపీ అభివృద్ధికి అవసరమని ఈ సందర్బంగా యోగేంద్రనాథ్ ప్రశంసించారు

Published By: HashtagU Telugu Desk
Yogendranath Posani

Yogendranath Posani

ఎన్నికల సమయం (AP Elections) దగ్గర పడుతున్న కానీ ఇంకా వలసల పర్వం మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. వైసీపీ లోని కీలక నేతలే కాదు నేతల తాలుకా కుటుంబ సభ్యులు సైతం వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది వైసీపీ ని వీడి టీడీపీ లో చేరగా..తాజాగా వైసీపీ నేత పోసాని (Posani Krishnamurali)కి బిగ్ షాక్ ఇచ్చారు ఆయన సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్ (Yogendranath Posani). వైసీపీ ని కాదని..టీడీపీలో చేరారు. సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ లో చేరారు. యోగేంద్రనాథ్ కు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు బాబు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని.. ఆయన ముందుచూపు ఏపీ అభివృద్ధికి అవసరమని ఈ సందర్బంగా యోగేంద్రనాథ్ ప్రశంసించారు. ఆయన ఆశయాలు నచ్చే తాను టీడీపీలో చేరానని.. టీడీపీలో చేరిక తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. యూకేలో వ్యాపారవేత్తగా ఉన్న యోగేంద్రనాథ్ హైదరాబాద్‌లోనూ తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు.

ఇక పోసాని కృష్ణ మురళికి విషయానికి వస్తే..గత ఎన్నికల్లో వైసీపీ కి మద్దతు తెలుపుతూ..పార్టీ ప్రచారంలో పాల్గొని వైసీపీ విజయంలో భాగమయ్యాడు. టీడీపీ , జనసేన నేతలను విమర్శించడంలో పోసాని ముందు వరుసలో ఉంటారు. గత పది రోజులుగా పవన్ కళ్యాణ్ ఫై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఇప్పుడు తన కుటుంబ సభ్యుడే జగన్ వద్దని , చంద్రబాబే కావాలని చెప్పి టీడీపీ లో చేరాడు. దీనిపై పోసాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read Also : Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా ఉపయోగించేది ముస్లింలే – ఓవైసీ

  Last Updated: 29 Apr 2024, 04:11 PM IST