Site icon HashtagU Telugu

Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు

Yogavizag

Yogavizag

విశాఖ సాగరతీరంలో యోగాంధ్ర – 2025 (Yogandhra 2025) కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Day Of Yoga) సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (Modi), ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CBN, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)లు హాజరయ్యారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్ల మేర యోగాసనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 3.5 లక్షల మంది పాల్గొనగా, బీచ్ రోడ్డులో ప్రధాన వేదికను ఏర్పాటు చేసి, మోదీతో పాటు ముఖ్య నేతలు యోగాసనాలు వేశారు.

అద్భుతమైన ఏర్పాట్లు – భద్రతతో పాటు హెల్త్ కేర్

ఈ మహా యోగా కార్యక్రమం (Yogandhra 2025) కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొత్తం 326 యోగా కంపార్ట్‌మెంట్‌లు ఏర్పాటు చేసి, ప్రతి కంపార్ట్‌మెంట్‌కు డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు యోగా శిక్షకులు, వాలంటీర్లు, వైద్య సహాయకులు ఏర్పాటు చేశారు. పాల్గొనే వారందరికీ యోగా మ్యాట్, టీ షర్ట్, గ్లూకోజ్‌, బిస్కెట్‌, అరటిపండు, నీళ్ల సీసాలు పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు 116 అంబులెన్సులు, 50 వైద్య శిబిరాలు, 307 ప్రథమ చికిత్స కేంద్రాలు సిద్ధంగా ఉంచారు.

భారతానికి గౌరవం తెచ్చే యోగా ఉత్సవం

విశాఖ యోగాంధ్ర కార్యక్రమం (Yogandhra 2025) ప్రపంచవ్యాప్తంగా భారత యోగా సంప్రదాయాన్ని చాటేలా జరిగింది. సముద్ర తీరంలోని గ్రీన్ మ్యాట్లపై వేలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేసిన దృశ్యం అద్భుతంగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంలో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ఈ చారిత్రాత్మక ఉత్సవాన్ని నిర్వహించి మరో మైలురాయి సాధించింది.

Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ