Arogya Andhra Pradesh : విజయవాడ నగరంలో జూన్ 11వ తేదీన ఓ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. నగరంలోని ప్రముఖ బెరంపార్క్ వద్ద కృష్ణా నదిపై నూరిమందికిపైగా యోగా ఔత్సాహికులు పడవలపై యోగా చేయడం ద్వారా ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఇది కేవలం యోగా చేయడమే కాకుండా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే జీవనశైలికి ప్రతీకగా నిలిచింది. ఈ వినూత్న ప్రయత్నం ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంలో భాగంగా చేపట్టబడింది. ఈ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జూన్ 20న నిర్వహించిన ప్రత్యేక వేడుకలో అందజేశారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి అలీషా రేనాల్డ్స్ ఈ కార్యక్రమానికి హాజరై, అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్ష్మీశ గారికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా, ‘విజన్ 2047’ లక్ష్యాలను చేరుకోవడంలో ఇలాంటి ఆరోగ్యకర కార్యక్రమాలు మద్దతుగా నిలుస్తాయి అని చెప్పారు.
Read Also: Election Commission : ఎన్నికల వీడియోల దుర్వినియోగంపై రాష్ట్రాలకు ఈసీ సూచన
కృష్ణా నదిపై పడవలపై నిర్వహించిన యోగా కార్యక్రమం ఎంతో ఆకర్షణీయంగా మారింది. పలు వయస్సుల ప్రజలు, యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాధారణంగా నేలపై చేసే యోగా విన్యాసాలను నీటి మీద పడవలపై చేయడం చాలా సవాలుతో కూడినది. అయితే ఈ సాహసోపేత యత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఒక విశ్వ రికార్డుగా నిలపడం గొప్ప గౌరవంగా భావించాల్సిన విషయమని పలువురు భావిస్తున్నారు. ప్రపంచ రికార్డు ప్రతినిధి అలీషా మాట్లాడుతూ..నేలపై కంటే నీటి మీద యోగా చేయడం చాలా క్లిష్టమైన విషయం. ఇది శరీర సమతుల్యత, నియంత్రణకు పరీక్షగా నిలుస్తుంది. కానీ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంతమంది ఒకే సమయంలో పడవలపై యోగా చేయడం నన్నెంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది నిజంగా అద్భుతమైన కార్యక్రమం అని ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి యోగా గురువులు, జిల్లాలోని పలువురు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ, మత్స్యకార సంఘాలు సమిష్టిగా పని చేశాయి. కృష్ణా నదిలోని భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి పడవకు పరిక్షణ చేయడం, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం ద్వారా అన్ని ఏర్పాట్లు అత్యుత్తమంగా చేపట్టారు. ఈ కార్యక్రమం కేవలం రికార్డు కోసమే కాదు, ప్రజల్లో ఆరోగ్యపరమైన చైతన్యం పెంచేందుకు ఒక మార్గదర్శిగా నిలిచింది. సముదాయంగా సాధించిన ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ యోగా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాశిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Ind vs Eng : టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందన్న సచిన్