Site icon HashtagU Telugu

Revaluation : టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసిపి అనవసర రాద్ధాంతం

10th Paper

10th Paper

అమరావతి: పదోతరగతి పరీక్షల రీవాల్యుయేషన్ (Revaluation of Tenth Papers) పై వైసిపి పార్టీ ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ బురదజల్లుతోంది. ఇందుకు సంబంధించి వాస్తవాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతోంది. టెన్త్ ఫలితాలు విడుదలయ్యాక కొన్ని పేపర్లలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినపుడు రీకౌంటింగ్, రీవెరిఫిషన్ కు కోరడం ఎప్పటినుంచో సహజంగా జరిగే ప్రక్రియ. గత నాలుగేళ్లలో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరిన విద్యార్థులు, ఆయా పేపర్లలో జరిగిన మార్పులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ కోసం 2022లో 41,694 దరఖాస్తులు రాగా, అందులో 8,235 స్క్రిప్టులు (20శాతం), 2023లో 61,887 దరఖాస్తులు రాగా, అందులో 10,987 స్క్రిప్టులు (18శాతం), 2024లో 55,930 దరఖాస్తులు రాగా, 9,231 (17శాతం), 2025లో 66,363 దరఖాస్తులు రాగా, 11,175 (18శాతం) స్క్రిప్టులకు సంబంధించి మార్కుల్లో మార్పులు రాగా, వాటిని సరిచేయడం జరిగింది. ఈ ఏడాది ఎస్ఎస్ సి పబ్లిక్ పరీక్షలకు 6,14,459మంది విద్యార్థులు హాజరుకాగా, 34,709మంది విద్యార్థులు 66,363 పేపర్ల రీకౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 10,159 మంది విద్యార్థులకు సంబంధించి 11,175 స్క్రిప్టుల్లో మార్కుల తేడాలను గమనించి సరిచేయడం జరిగింది.

Easwaran Departs: రోహిత్ శ‌ర్మ రిప్లేస్‌మెంట్.. నిరాశ‌ప‌ర్చిన అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌!

అందులో 24,550 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న 55,188 (83.16%) పేపర్లలో ఎటువంటి మార్పులు లేవు. 8,863 స్క్రిప్టుల్లో (13.36%) కేవలం 1నుంచి 5 మార్కుల వ్యత్యాసం కన్పించగా, 1506 స్క్రిప్టుల్లో (2.27%) 6నుంచి 10మార్కుల వ్యత్యాసం కన్పించింది. 343 స్క్రిప్టుల్లో (0.52శాతం) 11నుంచి 15మార్కులు, 163 స్క్రిప్టుల్లో (0.25%) 16నుంచి 20 మార్కుల వ్యత్యాసాన్ని, 300 స్క్రిప్టుల్లో 20 మార్కులకు పైబడి మార్కుల తేడాను గుర్తించి సరిచేయడం జరిగింది. ఈ ఏడాది మొత్తం మూల్యాంకన జరిగిన 45,96,527 స్క్రిప్టుల్లో వ్యత్యాసం గుర్తించింది 0.0006 శాతం స్క్రిప్టుల్లో మాత్రమే.

పదోతరగతి విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసానికి సంబంధించి బాధ్యులను చేస్తూ రెండుదశాబ్ధాల్లో తొలిసారిగా 5గురు ఎవాల్యుయేటర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. రీకౌంటింగ్/రీ వెరిఫికేషన్ కు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, తప్పులున్న వాటిని సరిచేసి జూన్ 1, 2025కల్లా డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్ జెయు కెటిల్లో దరఖాస్తులకు మే 20, 2025 చివరితేదీ కాగా, రీవెరిఫికేషన్ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా జూన్ 5 నుంచి జూన్ 10వతేదీ వరకు స్పెషల్ రీఅప్లికేషన్ విండో తెరచి ఉంచాలని ఆదేశించడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి తప్పిదాలను సాధ్యమైనంత తగ్గించేందుకు ఒఎంఆర్ షీటు డిజైన్ లో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.