Site icon HashtagU Telugu

Alla Ramakrishna Reddy : వ్యక్తిగత కారణాలవల్ల వైసీపీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా – ఆళ్ల

YCP Mangalagiri MLA Alla Ramakrishna Reddy Resigns

YCP Mangalagiri MLA Alla Ramakrishna Reddy Resigns

ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భారీ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి (Alla Ramakrishna Reddy) తన ఎమ్మెల్యే పదవి తో పాటు పార్టీ కి రాజీనామా (Resigns) చేసారు. గత కొద్దీ నెలలుగా పార్టీ ఫై అసంతృప్తిగా ఉన్న ఆళ్ల..నేడు పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..1995 నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్ గా పని చేసుకుంటూ వచ్చానని.. వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద పని చేస్తూ 2004లో సత్తెనపల్లి టికెట్ ఆశించి భంగపడ్డానని, 2009లో పెదకూరపాడు సీటును ఆశించి మళ్లీ భంగపడ్డానని .. అయినప్పటికీ వైఎస్సార్ ను కానీ, కాంగ్రెస్ ను కానీ ఒక్కమాట కూడా అనలేదని , ఆ తర్వాత వైసీపీని జగన్ స్థాపించారని, ఆయన ఆహ్వానం మేరకు వైసీపీలో చేరానని ఆర్కే చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా తనకు జగన్ రెండు సార్లు అవకాశం కల్పించారని… ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.

2014 నుంచి ఇప్పటి వరకు నీతి, నిజాయతీగా ఎమ్మెల్యేగా పని చేశానని… ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేశానని ..ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ..తప్పడం లేదని చెపుతూ తాను వైసీపీ పార్టీ కి , అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను కూడా ఆయన మీడియాకు చూపించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో అందజేశానని… తన రాజీనామాను నేరుగా ఇద్దామని స్పీకర్ కార్యాలయానికి వెళ్లానని… అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఓఎస్డీకి లేఖను అందజేశానని ఆర్కే తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరానని తెలిపారు. తన వ్యక్తిగత కారణాలవల్ల ఈరోజు శానససభ సభ్యత్వానికి, వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని స్పష్టం చేసారు. ఇదిలా ఉంటె మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఆళ్ల ఉన్నారని , అలాగే రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి భావిస్తున్నారు. ఈ కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేశారని అనుచరులు చెబుతున్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయనకు 2019 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ పై 5337 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 జూన్లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) కు ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.

Read Also : Pawan Kalyan: నాదేండ్ల ను విడుదల చేయకపోతే విశాఖ వస్తా పోరాడతా: పవన్ కళ్యాణ్