Site icon HashtagU Telugu

Jagan : వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.. గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి – జగన్ ట్వీట్

Jagan Emoshanal

Jagan Emoshanal

ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. కూటమి అధికారంలోకి రావడం తో పలు చోట్ల టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. గతంలో తమపై దాడి చేసి, ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. నిన్నటి నుండి అనేక చోట్లా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో ఈ దాడులపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి అంటూ మాజీ సీఎం జగన్ కోరారు. ఈ మేరకు జగన్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ప్రమాణస్వీకారానికి ముందే ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ జగన్‌ పేర్కొన్నారు. ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. గవర్నర్‌.. వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ కి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్‌.. వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’’. అంటూ జగన్‌ ట్వీట్ చేసారు. ఇదే విషయంపై ఈ రోజు సాయంత్రం వైసీపీ నేతలు గవర్నర్‌ను కలిసి టీడీపీపై ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.

Read Also : TTD : టీటీడీ చైర్మన్ గా నిర్మాత అశ్వినీదత్ ..?