Site icon HashtagU Telugu

AP Elections : పోటీ నుండి తప్పుకుంటే వైసీపీ రూ.5 కోట్లు ఇస్తామన్నారు – దస్తగిరి

Dasthagiri Nomination

Dasthagiri Nomination

జై భీమ్​రావు భారత్ పార్టీ తరపున పులివెందులలో నామినేషన్ వేసిన దస్తగిరి (Dasthagiri) ..అధికార పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేసారు. గురువారం ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో జైభీమ్‌రావు ( Jaibeemrao ) పార్టీ తరుఫున నామినేషన్‌ వేశారు. వైసీపీ అధినేత , సీఎం జగన్ పోటీ చేస్తున్న స్థానం నుంచే దస్తగిరి పోటీ చేయడం రాజకీయ ప్రాదాన్యం సంతరించుకున్నది. సరిగ్గా ఐదేళ్ల క్రితం మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి హత్య జరుగగా ఈ కేసులో నిందితుల్లో ఒకరైన దస్తగిరి అప్రూవర్‌గా మారడం, కోర్టుల ఆదేశాల మేరకు బెయిల్‌పై విడుదల, భారీ భద్రతల మధ్య దస్తగిరి బయట తిరుగుతున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా బరిలోకి దిగుతుండడం తో అంత ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ..తనను నామినేషన్ వేయకుండా వైసీపీ తీవ్రంగా ట్రై చేసిందని.. తాను బరిలో నుండి తప్పుకుంటే రూ. 5 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేసారని దస్తగిరి చెప్పుకొచ్చారు. పులివెందల సభలో సీఎం జగన్ ఇష్టానుసారం ఏదేదో మాట్లాడారని..వివేకా ను ఎవరు చంపారో ఎవరు చంపించారు జగన్ కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలు, బెదిరింపులను లెక్కచేయకుండా జగన్ ను దీటుగా ఎదుర్కోవడానికి తాను పోటీలో ఉన్నానని దస్తగిరి చెప్పుకొచ్చారు. వివేక హత్య కేసులో తప్పు చేసిన వ్యక్తి ఇప్పుడు మారిన మనిషిగా ముందుకొచ్చాడని జై భీమ్​రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. హత్యా రాజకీయాల నుంచి మారడానికి దస్తగిరికి ఒక అవకాశం ఇచ్చి ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని జడ శ్రవణ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also : Traffic Diversion : రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..