Site icon HashtagU Telugu

AP : అమరావతి పేరుతో టీడీపీ దోచుకుంది – వైసీపీ ట్వీట్

Ap Capital Issue

Ap Capital Issue

ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తుండడం తో మరోసారి ఏపీ రాజధాని (AP Capital) అంశం తెరపైకి వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతి (Amaravathi)ని ప్రకటించింది గత టీడీపీ సర్కార్ (TDP Govt)..ఆ తర్వాత అక్కడ నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ (YCP Govt)..ఏపీ రాజధాని అమరావతి కాదని..మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి..అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడం తో మళ్లీ రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని , పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలనీ , ఏపీకి రాజధానిగా అమరావతిని చేయాలంటూ గట్టిగా వాదిస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ సైతం కాంగ్రెస్ రాజధాని అంశం , పోలవరం , ప్రత్యేక హోదా తదితర అంశాలను లేవనెత్తుతున్నారు. దీంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఇది గ్రహించిన వైసీపీ..మళ్లీ అమరావతే ఏపీ రాజధాని అంటూ కొత్త రాగం పట్టుకుంది. దీంతో టీడీపీ వైసీపీ ఫై నిప్పులు చెరుగుతుంది. తాజాగా శంఖారావం యాత్ర చేపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రాజధానుల పేరుతో విశాఖలో ఒక్క ఇటుక పెట్టని జగన్ రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందించింది.

‘అమరావతి రాజధాని పేరుతో టీడీపీ దోచుకుంది. ఇప్పుడు ఆ లెక్కలన్నీ బయటకొచ్చి మీ మెడకు కేసులు చుట్టుకుంటున్నాయి. 3 రాజధానులను కోర్టు కేసులతో మీరే కదా అడ్డుకుంది? ఈ ఐదేళ్లలో ఎన్ని పరిశ్రమలు APకి వచ్చాయో తెలియాలంటే పచ్చ పత్రికలు వదిలి.. ఇతర పత్రికలు చదువు’ అని ట్వీట్ చేసింది.

Read Also : Hyderabad: ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందిన చంచల్‌గూడ ఖైదీ