Rushikonda : రుషికొండ ఫై ఉన్నవి ప్రభుత్వ భవనాలే – వైసీపీ ట్వీట్

రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 09:05 PM IST

రుషికొండ (Rushikonda )లో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. కేవలం ఆయన మాత్రమే కాదు మీడియా ను సైతం లోనికి తీసుకెళ్లి అక్కడ ఏంజరిగింది..? జగన్ ఎలా నిర్మించారు..? లోపల ఏమేమి ఉన్నాయి..? వంటివి బయటపెట్టారు. వాటిని చూసి లోపలి వెళ్ళినవారు కాదు మీడియాలో వాటిని చూసిన ప్రజలు సైతం ఆశ్చర్యం , షాక్ కు గురయ్యారు.

ఒకప్పుడు రాజులు నిర్మించుకునే ప్యాలెస్‌కు ఏ మాత్రం తీసిపోకుండా భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఎంత గొప్పగా రుషికొండ ఫై జగన్ ప్యాలెస్‌ నిర్మించారు. దాదాపు 500 కోట్ల రూపాయలతో భవనాల నిర్మాణం జరిగింది. కేవలం బాత్ టబ్ కే రూ. 26 లక్షలు ఖర్చు చేసారని..ప్రజల సొమ్మును వీరు ఎంతలా వాడుకున్నారో చూడండి అంటూ టీడీపీ ఆరోపించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ..” పచ్చటి రుషికొండకు బోడిగుండు కొట్టారని .. అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారని, లాభాల్లోని టూరిజం భవనాలను కూల్చి రాజ భవనాలు నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సద్దాం హుసేన్, గాలి జనార్దన్ రెడ్డి భవనాలను మించి ప్రజా ధనంతో వీటిని కట్టారని శ్రీనివాస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 61ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారని పేర్కొన్నారు.

కాగా టీడీపీ నేతల ఆరోపణలను వైసీపీ ఖండించింది. రుషికొండ ఫై నిర్మించినవి ప్రైవేటు ఆస్తులు కాదని, ఎవరి సొంతకాదని తెలిపింది. విశాఖకు గత ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, అందుకే అలాంటి భవనాలను నిర్మించిందని, ఇక ఆ భవానాలను ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వం ఇష్టమని పేర్కొన్నారు.”అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు.’ అని వైసీపీ పార్టీ అధికారికంగా ట్వీట్ చేసింది.

Read Also : Rushikonda : వామ్మో… రుషికొండ జగన్ ప్యాలెస్ లో 26 లక్షల విలువచేసే బాత్ టబ్