Site icon HashtagU Telugu

YCP Truth Bomb : ‘ట్రూత్ బాంబ్’..ఇదే

Ycp Truth Bomb

Ycp Truth Bomb

వైసీపీ (YCP) పార్టీ చెప్పినట్లే ఈరోజు మ.12గంటలకు ‘ట్రూత్ బాంబ్’ (YCP Truth Bomb) ఏంటో ట్వీట్ చేసింది. ‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా (Drug mafia
)ని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ కొన్ని పత్రాలను జత చేసింది. మరి ఈ సాక్ష్యాలపై టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

వాస్తవానికి నిన్న టీడీపీ – వైసీపీ ఇరు పార్టీలు ఈరోజు (అక్టోబర్ 24) పోటాపోటీగా ట్వీట్స్ చేసాయి. మధ్యాహ్నం 12 గంటలకు ‘Big Expose’ అంటూ ముందుగా టీడీపీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ‘Truth Bomb Dropping’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇలా ఇరు పార్టీల పోస్టులకు అర్థం ఏంటి? రేపు ఏం చెప్పబోతున్నాయి? ఏంజరగబోతుంది..? అని టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకోగా..చెప్పిన దానికంటే ముందే టీడీపీ నిన్న సాయంత్రం షర్మిల కు జగన్ రాసిన లేఖ..దానికి షర్మిల ఇచ్చిన కౌంటర్ లేఖలను టీడీపీ ..ట్విట్టర్ లో పోస్ట్ చేసి సంచలనం రేపింది. ఇక ఈరోజు వైసీపీ ఎలాంటి బాంబ్ పేలుస్తుందో అని ఎదురుచూడగా..డ్రగ్స్ మాఫియా నిజాలు బయటపెట్టింది. మరి దీనిపై టీడీపీ స్పందన ఎలా ఉంటుందో..!!

Read Also : Diwali 2024: దీపావళి పండుగ రోజు లక్ష్మి పూజ ఎందుకో తెలుసుకోవాలో తెలుసా?