Site icon HashtagU Telugu

Truth Bomb : ట్రూత్ బాంబ్.. వీడియో రిలీజ్ చేసిన వైసీపీ

Ycp Releases Truth Bomb

Ycp Releases Truth Bomb

సత్యవర్ధన్ కిడ్నాప్ (Satyavardhan Kidnapped) కేసులో నిజం ఏంటనేదాన్ని బయటపెట్టేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ‘ట్రూత్ బాంబ్’ (Truth Bomb) పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి సత్యవర్ధన్ అని, అతడిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నప్పటికీ, ఈ వీడియో చూస్తే అసలు నిజాలు మరొక విధంగా ఉన్నాయని వైసీపీ చెబుతోంది.

వైసీపీ విడుదల చేసిన ఈ వీడియోలో ఫిబ్రవరి 12న విశాఖపట్నంలో సత్యవర్ధన్ (Satyavardhan ) స్వేచ్ఛగా షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నట్లు చూపించారు. ఇది చూస్తే అతడు కిడ్నాప్‌ అయినట్లు ఏమాత్రం అనిపించడం లేదని, పోలీసులు తప్పుడు కేసు పెట్టారని వైసీపీ ఆరోపించింది. ఈ వీడియోను ఆధారంగా చూపిస్తూ, అధికారపార్టీ అసత్య ఆరోపణలు చేస్తోందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

ఈ వీడియో వివాదాస్పదంగా మారింది. సత్యవర్ధన్ నిజంగా కిడ్నాప్ అయ్యాడా? లేదా, రాజకీయ కుతంత్రాల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని వక్రీకరించారా? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ వీడియోపై అధికార టీడీపీ, పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో అసలు నిజాలు బయటకు రావాలంటే, పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.