YCP-TDP :ద‌ళిత కార్డ్ తీసిన జ‌గ‌న్ !CBN టార్గెట్‌

తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ను అడ్డుకోవ‌డానికి ద‌ళిత కార్డ్ ను వైసీపీ(YCP-TDP) ప్ర‌యోగించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 25, 2023 / 03:39 PM IST

తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ను అడ్డుకోవ‌డానికి ద‌ళిత కార్డ్ ను వైసీపీ(YCP-TDP) బ‌య‌ట‌కు తీసింది. పెత్తందార్ల‌కు, పేద‌ల‌కు మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ అంటూ చెబుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ద‌ళిత అస్త్రాన్ని ప్ర‌యోగించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఇటీవ‌ల ఎర్ర‌గొండ‌పాలెం ఎపిసోడ్ ను క్రియేట్ చేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. అక్క‌డ జ‌రిగిన దాడిని ద‌ళితుల వైపు మ‌ళ్లించ‌డానికి వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ను అడ్డుకోవ‌డానికి ద‌ళిత కార్డ్ (YCP-TDP)

కొన్ని సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ద‌ళితుల‌కు వ్య‌తిరేక‌మైన‌విగా వైసీపీ ఫోక‌స్(YCP-TDP) చేస్తోంది. పార్టీలోని ఎస్సీ వ‌ర్గానికి చెందిన లీడ‌ర్ల‌ను రంగంలోకి దింపింది. చంద్ర‌బాబును ద‌ళిత వ్య‌తిరేకిగా క్రియేట్ చేసేలా మీడియా ముందుకు వ‌స్తున్నారు. గ‌తంలోని కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను ఉద‌హ‌రిస్తూ చంద్ర‌బాబునాయుడు, లోకేష్ ల‌ను ద‌ళితుల‌కు వ్య‌తిరేకులు అనే ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దాడుల‌ను చంద్ర‌బాబు ప్రోత్స‌హించే వాటిగా చిత్రీక‌రించాల‌ని ప్లాన్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్‌లు, ఎస్సీ వర్గాలకు చెందిన ఇతర నేతలు అత్య‌వ‌సరంగా స‌మావేశం అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) స‌ర్కార్ దళితులకు అందించిన ప‌థ‌కాల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించారు. అదే సంద‌ర్భంలో చంద్ర‌బాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ ఎస్సీ వ‌ర్గాల‌ను టీడీపీకి వ్య‌తిరేకం చేయాల‌ని స్కెచ్ వేశారు. రాష్ట్రంలో జ‌రుగుతోన్న దాడుల‌ను చంద్ర‌బాబు ప్రోత్స‌హించే వాటిగా చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. విచిత్రంగా రాష్ట్రంలో ద‌ళితుల‌పై జ‌రిగిన దాడుల‌ను టీడీపీ చేయించిన‌విగా వైసీపీ చెబుతోంది.

నయీం ద్వారా దాడుల‌కు చంద్రబాబు కుట్ర లేపార‌ని

దళితులపై దాడులను చంద్ర‌బాబు ప్రోత్సహిస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. కుట్రల‌కు దళితులు బలి కాకూడదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో దళితుల సంక్షేమం కోసం దాదాపు రూ.53 వేల కోట్లను ప్ర‌భుత్వం కేటాయించిందని లెక్క‌లు చెబుతున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌పై దాడి చేసిన నయీం ద్వారా దాడుల‌కు చంద్రబాబు కుట్ర లేపార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు, లోకేష్‌లకు దళితులు తగిన గుణపాఠం చెబుతారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

Also Read : YCP- BJP : బంధానికి గండి! జ‌గ‌న్ స‌ర్కార్ కు మూడిన‌ట్టే?

ఏపీలోని 29 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీ 28 స్థానాల్లో విజయం సాధించిందని రవాణా శాఖ మంత్రి పైనెపె విశ్వరూప్‌ అన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవాలనే ఆసక్తి టీడీపీ నేతకు ఉందని, సంక్షేమం అందించడంలో మాత్రం ఆసక్తి లేదని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. దళితులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో అవగాహన కల్పించేందుకు పార్టీ నాయ‌కులు ప్ర‌య‌త్నం చేయాల‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. అంటే, ద్విముఖ వ్యూహంతో టీడీపీ మీద రాజ‌కీయ దాడి చేయ‌డానికి వైసీపీ ప్లాన్(YCP-TDP) చేసింద‌న్న‌మాట‌.

Also Read : TDP : చంద్ర‌బాబు ఆయుధాలు కోడిక‌త్తి,వివేకా హ‌త్య