YCP-TDP : జ‌గ‌న్ న‌జ‌ర్,చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌పై జీవో నెంబ‌ర్ 1

జీవో నెంబ‌ర్ 1 ఒక వివాదస్ప‌ద(YCP-TDP) నిర్ణ‌యం. దాన్ని క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి యంత్రాంగానికి ఇచ్చిన డైరెక్ష‌న్‌.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 03:36 PM IST

జీవో నెంబ‌ర్ 1 ఒక వివాదస్ప‌ద(YCP-TDP) నిర్ణ‌యం. దాన్ని మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని తాజాగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan mohan Reddy) యంత్రాంగానికి ఇచ్చిన డైరెక్ష‌న్‌. అంటే, ఇక నుంచి రాష్ట్రంలో ఎవ‌రూ ముంద‌స్తు అనుమ‌తి లేకుండా రోడ్ షోలు పెట్ట‌కూడ‌దు. బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌కూడ‌దు. పోలీసులు చెప్పిన ప్రాంతంలో అనుమ‌తించినంత మంది జ‌నంతో మీటింగ్ లు పెట్టుకోవాలి. బ్రిటీస్ కాలం నాటి ఈ జీవోను ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ బ‌య‌ట‌కు తీసిన విష‌యం విదితమే.

జీవో నెంబ‌ర్ 1 ఒక వివాదస్ప‌ద నిర్ణ‌యం(YCP-TDP) 

జీవో నెంబ‌ర్ 1 మీద న్యాయ‌పోరాటం టీడీపీ(YCP-TDP) చేస్తోంది. ఆ మ‌ధ్య `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ సంద‌ర్భంగా కందుకూరు, గుంటూరు ప్రాంతాల్లో 11 మంది తొక్కిస‌లాట‌లో చ‌నిపోయారు. వెంట‌నే ఈ జీవో నెంబ‌ర్ 1ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan mohan Reddy) స‌ర్కార్ అమ‌లు చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఆ జీవో ఇష్యూ చేసిన త‌రువాత కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి అప్ప‌ట్లో వెళ్లారు. పోలీసులు అడుగ‌డుగునా అడ్డుకున్నారు. మూడో రోజుల పాటు ఆయ‌న ప‌ర్య‌ట‌న జ‌ర‌గ‌కుండా ఆ జీవోను చూపించారు. దానిపై చంద్ర‌బాబు (Chandrababu) ఆగ్ర‌హిస్తూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన విష‌యం విదిత‌మే. అయితే, ఆ జీవో విడుద‌ల చేసిన త‌రువాత `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ను దూకుడుగా తీసుకెళ్ల‌డంలో చంద్ర‌బాబు ఆచితూచి అడుగు వేస్తున్నారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న

ఇటీవ‌ల ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా జ‌నం ఎగ‌బ‌డుతున్నారు. గ‌త 40ఏళ్లుగా సుప‌రిచ‌మైన లీడ‌ర్, స్పీచ్ అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మీద అభిమానం జ‌నానికి పెరిగింది. దానికి కార‌ణంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న అంటూ టీడీపీ (YCP-TDP) భావిస్తోంది. ఉత్త‌రాంధ్ర నుంచి ఉభ‌య గోదావ‌రి, రాయ‌ల‌సీమ‌, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నిర్వ‌హించిన ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి ప్రోగ్రామ్ అనూహ్యంగా విజ‌య‌వంతం అయింది. జీవో నెంబ‌ర్ 1 విడుద‌ల అయిన తరువాత వ‌రుస‌గా ఈ ప్రోగ్రామ్ ను పెట్టుకోవ‌డంలేదు. వాస్త‌వంగా వారానికి మూడు రోజుల పాటు ఒక్కో జిల్లాకు కేటాయించారు. తొలి రోజు రోడ్ షోలు, రెండో రోజు ఆ జిల్లాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిలు, ఇత‌ర నేత‌ల‌తో రివ్యూ, మూడో రోజు బ‌హిరంగ స‌భ ఉండేలా `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..`ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. కానీ, జీవో విడుద‌లైన తరువాత కొంత గ్యాప్ ఇచ్చారు. మ‌ళ్లీ కృష్ణా జిల్లాలో ఈ ప్రోగ్రామ్ ను నిర్వ‌హించారు. గుడివాడ‌, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న వ‌చ్చింది.

వ‌డ‌గ‌ళ్ల‌ వాన‌, అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతుల్ని..

తాజాగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చంద్ర‌బాబు(Chandrababu) వెళుతున్నారు. వ‌డ‌గ‌ళ్ల‌ వాన‌, అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతుల్ని ప‌రామ‌ర్శిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా జ‌నం ఆయ‌న్ను అనుస‌రిస్తున్నారు. గ‌త రెండు రోజులుగా ఏలూరు చుట్టు. ప‌క్క‌ల ప్రాంతాల్లోని రైతుల్ని ప‌రామ‌ర్శిండానికి వెళ్లారు. ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. పార్టీ ప‌రంగా ఆయ‌న రైతుల‌కు కొంత భ‌రోసా ఇస్తున్నారు. కానీ, రైతుల‌కు పూర్తి స్థాయిలో ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఆ ప‌ర్య‌ట‌న మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) క‌న్నేశారు. రైతుల్ని రెచ్చ‌గొడుతున్నార‌ని భావించార‌ట‌. అంతే, జీవో నెంబ‌ర్ 1 ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని పోలీసుల్ని ఆదేశించారు. దీంతో మ‌ళ్లీ చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌ను క‌ట్ట‌డీ చేసే ప్ర‌య‌త్నం మొద‌లైయింది.

Also Read : CBN : వైసీపీకి షాకింగ్, ప్ర‌చారానికి ర‌జ‌నీకాంత్?

ఎన్నిక‌ల‌కు స‌మీపిస్తోన్న వేళ సాధారణంగా విప‌క్షాలు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ‌తారు. ఆ సంద‌ర్భంగా మీటింగ్ లు పెడతారు. రోడ్ షోలు చేస్తుంటారు. త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడాప్ర‌జ‌ల్లోకి రావాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే, ముందుగా జీవో నెంబ‌ర్ 1కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌దును(YCP-TDP) పెడుతున్నారు. విప‌క్షాల ప్ర‌చార దూకుడును ఆపేందుకు ఇదో అస్త్రంగా మారింది. దాన్ని అమ‌లు చేస్తే విప‌క్షాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం క‌ష్ట‌మే. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఏమి చేస్తారో చూడాలి.

Also Read : Operation NTR Statue : BRS కు జూనియ‌ర్ క్రేజ్! రేవంత్, T-TDPకి బ్రేక్!