YCP Sketch : TDP,JSP మ‌ధ్య‌లో సాయిరెడ్డి `అగ్గి`

YCP Sketch : బ‌ల‌హీన‌మైన మిత్రుడు కంటే బ‌ల‌మైన శ‌త్రువు మేల‌ని నానుడి. దాన్ని ఏపీకు వ‌ర్తింప చేయ‌డానికి సాయిరెడ్డి ప్ర‌య‌త్నం చేశారు.

  • Written By:
  • Updated On - August 11, 2023 / 04:17 PM IST

YCP Sketch : బ‌ల‌హీన‌మైన మిత్రుడు కంటే బ‌ల‌మైన శ‌త్రువు మేల‌ని నానుడి. దాన్ని ప్ర‌స్తుతం ఉన్న ఏపీ రాజ‌కీయాల‌కు వ‌ర్తింప చేయ‌డానికి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌య‌త్నం చేశారు. రాబోవు రోజుల్లో ఏ పార్టీ ఓట్లు ఎటువైపు వెళ్ల‌బోతున్నాయి? అనేదానిపై అంచ‌నాలు వేస్తూ సంచ‌ల‌న ట్వీట్ చేయ‌డం జ‌రిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట్లు జ‌న‌సేన పార్టీకి, జ‌న‌సేన ఓట్లు బీజేపీకి ప‌డ‌తాయ‌ని లాజిక్ క్రియేట్ చేశారు. అంతేకాదు, 51శాతం ఓటు బ్యాంకు వైసీపీకి బ‌లంగా ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. అందుకే, 2024 ఎన్నిక‌ల‌కు బ‌దులుగా 2029 ఎన్నిక‌ల వైపు దృష్టి పెట్టండ‌ని తెలుగుదేశం పార్టీకి చుర‌క‌లు అంటించారు. అంతేకాదు, రెండో ప్లేస్ కోసం టీడీపీ, జ‌న‌సేన పోటీప‌డుతున్నాయ‌ని వ్యూహాత్మ‌క (YCP Sketch)  ట్వీట్ చేయ‌డం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

రెండో ప్లేస్ కోసం టీడీపీ, జ‌న‌సేన పోటీ (YCP Sketch)  

పొత్తుల పేరుతో గ‌త రెండేళ్లుగా జ‌న‌సేన పార్టీ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌కుండా ప‌వ‌న్ లాక్కొచ్చారు. అందుకు, చంద్ర‌బాబు కూడా స‌హ‌కారం అందించారు. దీంతో జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు ఖాయ‌మంటూ లీకులు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్ర‌మంలో ఆ రెండు పార్టీల పొత్తు మీద విశ్లేష‌ణ‌లు ప‌లు కోణాల నుంచి వ‌చ్చాయి. ప్ర‌ధానంగా సామాజిక‌వ‌ర్గాన్ని బేస్ చేసుకుని పొత్తును చూస్తే మాత్రం న‌ష్ట‌మే ఎక్కువ‌గా టీడీపీకి క‌నిపిస్తోంది. ఎందుకంటే, స్వ‌త‌హాగా ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు టీడీపీ సానుభూతిప‌రులు కాదు. అనాదిగా కాంగ్రెస్ పార్టీ సానుభూతిప‌రులు. అ త‌రువాత వైసీపీకి మ‌ళ్లారు. క‌రుడుగ‌ట్టిన కాపు సామాజిక‌వ‌ర్గం 2019 ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన వెంట ఉంది. ఆ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 4శాతం ఓటు బ్యాంకు పొత్తు ఉన్న‌ప్ప‌టికీ టీడీపీకి మ‌ళ్ల‌ద‌ని విశ్లేష‌కులు అంచ‌నా. అందుకే, ఆ ఓటు బీజేపీకి వెళుతుంద‌ని సాయిరెడ్డి  (YCP Sketch) అంచ‌నాగా ఉండొచ్చు.

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌ను హైలెట్ చేస్తూ మంత్రులు మీడియాముఖంగా ప్రెస్మీట్లు

రెండో ప్లేస్ కోసం టీడీపీ, జ‌న‌సేన పోటీప‌డుతున్నాయంటూ వ్యూహాత్మ‌కంగా సాయిరెడ్డి ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. కానీ, ఆయ‌న ట్వీట్ లోని ఆంత‌ర్యాన్ని గ‌మ‌నిస్తే, త‌ర‌హాలో వైపీపీ గేమాడుతుంది? అనేది బోధ‌ప‌డుతోంది. గ‌త కొంత కాలంగా జ‌న‌సేన పార్టీని వ్యూహాత్మ‌కంగా వైసీపీ    (YCP Sketch) హైలెట్ చేస్తోంది. ప్ర‌భుత్వప‌రంగా ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌ను హైలెట్ చేస్తూ మంత్రులు మీడియాముఖంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. దీంతో రాజ‌కీయం మొత్తం వైసీపీ, జ‌న‌సేన వైపు తిరుగుతోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేసిన‌ప్ప‌టికీ హైలెట్ కాకుండా జ‌గ‌న్ అండ్ కో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

లోకేష్ పాద‌యాత్ర  ఫోక‌స్ చాలా త‌క్కువ‌

ప్ర‌స్తుతం లోకేష్ పాద‌యాత్ర చేస్తున్నారు. ఆయ‌న‌కు వ‌చ్చిన ఫోక‌స్ చాలా త‌క్కువ‌. అలాగే, చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌ను అడ్డుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హై టెన్ష‌న్ క్రియేట్ చేస్తున్నారు. ఉద్రిక‌త్త ప‌రిస్థితుల మ‌ధ్య జ‌నం రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. అదే, ప‌వ‌న్ వారాహి ప‌ర్య‌ట‌న అంతా స‌వ్యంగా సాగుతోంది. భారీగా జ‌నాన్ని త‌ర‌లిస్తున్నారు. హాజ‌రవుతోన్న వాళ్ల‌లో వైసీపీ క్యాడ‌ర్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. జ‌నం కేరింత‌లు, ఈల‌ల‌ను గ‌మ‌నిస్తోన్న ప‌వ‌న్ సీఎం ప‌ద‌వి వైపు చూస్తున్నారు. వాపును చూసి బ‌లుపు అనుకునేలా జ‌న‌సేన పార్టీని మ‌భ్య‌పెట్టేలా వైసీపీ  (YCP Sketch) స్కెచ్ వేసింది. దానికి అనుగుణంగా జ‌న‌సేన కూడా ఇప్పుడు 20శాతం ఓటు బ్యాంకు ఉంద‌ని భావిస్తోంది. రాబోవు రోజుల్లో వారాహి యాత్ర ముగిసేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా 30శాతం ఓటు బ్యాంకు జ‌న‌సేను ఉంద‌నేలా ఫోకస్ ఇస్తున్నారు. ఇదంతా వైసీపీ ఆడుతోన్న గేమ్ లో భాగం. అందుకు త‌గిన విధంగా బీజేపీ ఢిల్లీ విభాగం వ్య‌వ‌హరిస్తోంది.

Also Read : Operation Vijayawada : జేపీ,వంగ‌వీటిపై YCP గురి

బ‌హుశా వైసీపీ ఎత్తుగ‌డ పారింద‌ని చెప్పుకోవ‌డానికి రెండో ప్లేస్టీ కోసం టీడీపీ, జ‌న‌సేన పోటీప‌డుతున్నాయ‌ని ట్వీట్ చేయ‌డం. ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసిన త‌రువాత ప‌వ‌న్ వాల‌కం మారింది. వారాహి యాత్ర ప్రారంభించిన రోజుకు ఇప్పుడు ఆయ‌న ఉన్న మాన‌సిక స్థితికి వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. ఆ స్థాయికి వైసీపీ వ్యూహాత్మ‌కంగా తీసుకెళ్లింది. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉత్త‌రాంధ్ర‌లో ఉన్నారు. అమ‌లాపురంలో జీరో వ‌డ్డీ రుణాల‌కు సంబంధించిన బ‌ట‌న్ నొక్కిన సీఎం య‌థాలాపంగా రాక్ష‌సులు అంటూ చంద్ర‌బాబు మీద విరుచుకుప‌డ్డారు. పుంగ‌నూరు ఘ‌ట‌న‌ను ఉద‌హ‌రిస్తూ రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగించేలా రాక్ష‌సునిగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.

Also Read : Jagan Temper : ఏపీలో పొలిటిక‌ల్ హై టెంప‌ర్

వాస్త‌వంగా పుంగ‌నూరు ఘ‌ర్ష‌ణ వెనుక వైసీపీ ఉంద‌ని వీడియోల‌తో స‌హా చంద్ర‌బాబు ప్ర‌ద‌ర్శించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ వ్య‌వ‌హరించిన తీరును కూడా ఎండ‌గ‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు 74 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, వాళ్లంద‌రూ టీడీపీ క్యాడ‌ర్ గా చెబుతోంది. ఆ రోజు పోలీసులు గాయ‌ప‌డేలా రాళ్ల విసిరిన వాళ్లంద‌రూ టీడీపీ క్యాడ‌ర్ గా చిత్రీక‌రిస్తున్నారు. అంతేకాదు, ఏ1గా చంద్ర‌బాబు మీద కేసు పెట్టారు. ఇలాంటి ప‌రిస్థితి జ‌న‌సేన విష‌యంలో ఎక్క‌డా క‌నిపించ‌దు. అంటే, టీడీపీ క్యాడ‌ర్ ను అణ‌చివేస్తూ, జ‌న‌సైనికుల‌ను రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతూ వైసీపీ వ్యూహాత్మ‌కంగా గేమాడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌న‌సేన పార్టీతో పొత్తుపెట్టుకుని టీడీపీ వెళితే, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేసిన‌ట్టుగా అవుతుందా? అనే అనుమానం టీడీపీ క్యాడ‌ర్లో ఉంది.