Site icon HashtagU Telugu

AP : బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ హైకమాండ్ షాక్ ..

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy)కి వైసీపీ హైకమాండ్ (YCP) భారీ షాక్ ఇచ్చింది. ఆయన ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy), పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి (Peddireddy Suryaprakash)ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే వీరిని సస్పెండ్ చేస్తున్న విషయం తనకు ఏమాత్రం చెప్పకుండా..సస్పెండ్ చేయడం పట్ల బాలినేని అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గత కొద్దీ నెలలుగా బాలినేని పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహం తో ఉన్నారు. జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేనికి తర్వాత ఉద్వాసన పలికారు. ఆ తర్వాత పార్టీ బాధ్యతలను అప్పగించారు.. కొన్ని సందర్భాల్లో మినహా.. పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా ఉన్న బాలినేని ఉన్నట్టుండి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు వైసీపీలో ప్రాధాన్యం దక్కడం లేదు. ప్రోటోకాల్ కూడా లభించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకే చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్‌తో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తనను తొలగించి ఆయనను మంత్రిగా కొనసాగించడంపై బాలినేని .. తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దానికి తోడు పార్టీ వ్యవహారాల్లో అసలు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని కొద్దీ నెలలుగా ఫీల్ అవుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆయన అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఆయనను మరింత బాధకు గురి చేసింది.

మరోపక్క నిన్న జరిగిన గడప గడపకు సమీక్షా లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు పనిచేయాలని, ఎమ్మెల్యేల పనితీరు బట్టే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని జగన్ సూచించారు. అంతేకాదు ఈసారి కొంతమందికి టికెట్ ఇవ్వడం లేదని.. వాళ్ళు అసంతృప్తికి గురికావద్దని..వారికీ ఏదొక పదవి ఇస్తామని చెప్పారు. దీనిబట్టి చూస్తే చాలామందికి ఈసారి టికెట్ రావడం కష్టమే అనిపిస్తుంది. మరి టికెట్ రాని నేతలు..వైసీపీ లో కొనసాగుతారా ..? లేదా మరో పార్టీ లో చేరుతారా..? అనేది చూడాలి.