ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియజేస్తాం అంటూ గొప్పగా చెప్పుకుంటూ చేపట్టిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర (YCP Samajika Sadhikara Bus Yatra) రెండు రోజులకే తుస్సుమంది. జనాలు లేక ఖాళీ కుర్చీలకు పధకాలు చెపుతూ వస్తున్నారు. గురువారం సామాజిక సాధికార బస్సు యాత్ర ను వైసీపీ నేతలు (YCP Leaders) ఇచ్ఛాపురం నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు బయలు దేరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని నేతలు ప్రజలకు వివరించాలని ప్లాన్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
కానీ ఈ ప్లాన్ మొదట్లోనే బెడిసికొట్టినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్లిన పెద్దగా జనాలు రావడం లేదు. డబ్బులు ఇచ్చి మరి తరలిస్తున్నప్పటికీ డబ్బులు తీసుకుంటున్నారు తప్ప జనాలు యాత్రలో పాల్గొనడం లేదు. ఇసకేస్తే రాలనంత జనం అని అధికారపార్టీ నేతలు చెప్పుకోవడం తప్ప వాస్తవానికి అక్కడ జనాలు లేక యాత్ర వెలవెలబోతోంది. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసైనా ఈసారి ఓటమి తప్పదని వైసీపీ నేతలు ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.
Read Also : Viral News: కామం హద్దులు దాటితే కుక్కలను కూడా వదలట్లేదు