రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ సర్కార్..ఇప్పటి నుండే ప్రచారం మొదలుపెట్టింది. ఈరోజు గురువారం సామాజిక సాధికార బస్సు యాత్ర ను ఇచ్ఛాపురం నుండి ప్రారంభించారు. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు బయలు దేరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని నేతలు ప్రజలకు వివరించనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరదు కల్యాణి పాల్గొన్నారు. గత నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించాం. కేబినెట్‌లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే మా పార్టీ కి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాం అని తెలిపారు. మా అధినాయకుడు జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతీ నాయకుడూ, కార్యకర్త పనిచేస్తున్నారు, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే అని పేర్కొన్నారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకూ మొదటి విడత సామాజిక సాధికార యాత్ర జరగనుంది. తొలి రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలోని శింగనమలలో యాత్రలు జరగనున్నాయి. మొదటి విడతలో 39 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది.
ఆయా ప్రాంతాల్లో వైసీపీ ముఖ్య నేతలు యాత్రలో పాల్గొంటారు. ఆయా నియోజకవర్గాల్లో ముందుగా ఎంపిక చేసిన సచివాలయాన్ని వైసీపీ నేతలు సందర్శిస్తారు. ఇక్కడే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, స్థానికంగా ఎంపిక చేసిన 200 మందితో కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. బస్సు యాత్ర జరిగే మార్గంలో ముందుగా నిర్ణయించిన చోట్ల ప్రజలతో మమేకమవుతారు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ సభలో బస్సు పై నుంచే నేతలు ప్రసంగిస్తారు. ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు అని తెలిపారు.
Read Also : Rythu Bandhu Scheme : రైతు బంధు పట్ల ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ