YCP Samajika Sadhikara Bus Yatra : నేటి నుంచి సామాజిక సాధికార యాత్ర రెండో దశ

మొదటి దశ సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా... రెండో దశ నేటి బుధవారం నుండి ప్రారంభమవుతోంది. ఈ నెల 30 వరకు ఈ యాత్ర జరుగుతుంది.

Published By: HashtagU Telugu Desk
Samajika Sadhikara Bus Yatra

Samajika Sadhikara Bus Yatra

వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర (YCP Samajika Sadhikara Bus Yatra) ..నేటి నుండి రెండో దశ (2nd Phase) మొదలుకాబోతుంది. సీఎం జగన్‌ (CM Jagan) పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును, సామాజిక న్యాయం, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర..మొదటి దశ సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా… రెండో దశ నేటి బుధవారం నుండి ప్రారంభమవుతోంది. ఈ నెల 30 వరకు ఈ యాత్ర జరుగుతుంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో యాత్ర జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

అక్టోబర్‌ 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్ర మొదటి దశ..35 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. రెండో దశలో 39 నియోజకవర్గాల్లో జరుగుతుంది. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఈ వర్గాల ఆర్ధిక సాధికారత కోసం తీసుకున్న చర్యలను, చేసిన మంచిని ఈ యాత్రల్లో నేతలు వివరిస్తున్నారు. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పాల్గొంటున్నారు. రెండో దశను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు వైసీపీ నేతలు.

Read Also : BRS : ప్రచారంలో కంట్రోల్ తప్పుతున్న బిఆర్ఎస్ అభ్యర్థులు..ఓటర్లపై ఆగ్రహం

  Last Updated: 15 Nov 2023, 10:51 AM IST