Vijayasai Reddy : మీరు పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరు: వైసీపీ

మీ అభిప్రాయాలు ఎల్లప్పుడూ గౌరవించబడతాయి. మీ భవిష్యత్ ప్రయత్నాలలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము అని పేర్కొంది.

Published By: HashtagU Telugu Desk
YCP responded to Vijayasai Reddy resignation..!

YCP responded to Vijayasai Reddy resignation..!

Vijayasai Reddy : రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని విజయసాయి రెడ్డి శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై వైసీపీ స్పందించింది. మేము మీ నిర్ణయాన్ని ఆమోదించకపోయినప్పటికీ గౌరవిస్తాము. వైసీపీ ఆవిర్భావం నుంచి కష్ట సమయాల్లోనూ, విజయాల్లోనూ మాతో పాటు నిలబడిన మీరు పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరు. మీ అభిప్రాయాలు ఎల్లప్పుడూ గౌరవించబడతాయి. మీ భవిష్యత్ ప్రయత్నాలలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము అని పేర్కొంది.

అయితే హార్టికల్చర్‌ లో మీ అభిరుచిని కొనసాగించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని వైసీపీ తెలిపింది. ఇక ఈరోజు ఉదయం తన పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయగా.. దానిని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనకర్ ఆమోదించారు. విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులిటెన్ విడుదల చేసింది.

కాగా, రాజీనామా అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని ఆయన తెలిపారు. తనలాంటి వాళ్లు వెయ్యి మంది వెళ్లినా జగన్‌కు ఆదరణ తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. తాను రాజీనామా చేయడానికి ముందు జగన్‌తో అన్ని విషయాలను చర్చించానని తెలిపారు. పదవికి రాజీనామా చేయడం సరికాదని కూడా జగన్‌ సూచించారని చెప్పారు. కానీ పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

మరోవైపు పార్టీ శ్రేణులు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే విజయసాయిరెడ్డి ఇంత సడన్‌గా ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇటీవలే ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా స్వీకరించారు. ఇలాంటి సమయంలో ఆయన జగన్‌కు తోడుగా ఉండాల్సిందిపోయి, ఇలా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వైసీపీ శ్రేణులు విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు.

Read Also: President Droupadi Murmu: ఈ రిప‌బ్లిక్ డే మ‌న‌కు మ‌రింత ప్ర‌త్యేకం: రాష్ట్ర‌ప‌తి

 

  Last Updated: 25 Jan 2025, 09:22 PM IST