Site icon HashtagU Telugu

MLA Kotamreddy : వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. బాబు అరెస్ట్‌పై వైసీపీలో..?

Kotamreddy Sridhar

Kotamreddy Sridhar

చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత వైసీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై రెబ‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వైసీపీలో మెజార్టీ వర్గం వ్యతిరేకిస్తోందని ఆయ‌న తెలిపారు. దీనివ‌ల్ల రాజకీయంగా నష్టపోతామని వైసీపీ నేతలే అంటున్నారని.. వైసీపీ సానుభూతిపరుడైన ఓ పారిశ్రామికవేత్త ప్రశాంత్ కిషోర్‍కు ఫోన్ చేసి చంద్రబాబు అరెస్ట్ పై ఆరా తీశారని తెలిపారు. వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రశాంత్ కిషోర్ ఆ పారిశ్రామిక‌వేత్త‌కు చెప్పారని.. లోకేష్‍ని అరెస్ట్ చేస్తే వైసీపీకి మరింత నష్టమని ప్రశాంత్ కిషోర్ అన్నారని శ్రీధ‌ర్ రెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్‍పై కేసులు పెట్టవద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పారని.. చంద్రబాబును అరెస్ట్ చేయడం సరైన పద్దతి కాదన్నారని ఎమ్మెల్యే తెలిపారు. బాబును అరెస్ట్ చేయాలనే పనికిమాలిన సలహాలు ప్రశాంత్ కిషోర్ ఇవ్వర‌ని.. వైసీపీలో పరిస్థితి బాగోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అన్నీ చేసినా గెలవలేకపోయిందని.. అభివృద్ధి లేదు.. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని శ్రీధ‌ర్ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. జగన్ ప్రశాంత్ కిషోర్ మాట వినలేదని ఆ పారిశ్రామికవేత్త త‌న‌తో చెప్పిన‌ట్లు శ్రీధ‌ర్ రెడ్డి తెలిపారు.