Site icon HashtagU Telugu

YCP Rajya Sabha Candidates : వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు?

Jagan Congress

Jagan Congress

మరికొన్ని నెలల్లో ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని సీఎం జగన్ (AP CM Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ.. ఇప్పటికే ఆరు జాబితాల్లో ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం జగన్.

అలాగే ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై కూడా సీఎం జగన్‌ గత కొద్దీ రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తూ వస్తున్నారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేస్తున్న వైసీపీ.. ప్రస్తుతం ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు(ఎస్సీ), మేడ రఘునాథ్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఈ ముగ్గురి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 8వ తేదీన మాక్‌ పోలింగ్ నిర్వహించే యోచనలో వైసీపీ ఉంది. రాజకీయ, సామాజిక, సమీకరణాల కోణంలోనే రాజ్యసభ సభ్యులు ఎంపిక చేసింది వైసీపీ. ఈ నెలలో మూడు రాజ్యసభ స్థానాలు కాళీ అవనున్నాయి. ఈ నెలతో సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తొలి ఐదు జాబితాల్లో 61 ఎమ్మెల్యేలు, 14 ఎంపీ స్థానాలకు ఇంఛార్జుల పేర్లను ప్రకటించిన జగన్.. ఆరో జాబితాలో నాలుగు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసారు.

ఆ వివరాలు (YCP 6th List) చూస్తే..

-రాజమండ్రి (ఎంపీ) – డాక్టర్ గూడూరి శ్రీనివాస్
-నర్సాపురం (ఎంపీ) – గూడూరి ఉమాబాల
-గుంటూరు (ఎంపీ ) – ఉమ్మారెడ్డి వెంకట రమణ
-చిత్తూరు (ఎస్సీ) (ఎంపీ) – ఎన్ రెడ్డప్ప
-మైలవరం – సర్నాల తిరుపతిరావు యాదవ్
-మార్కాపురం – అన్నా రాంబాబు
-గిద్దలూరు – కె. నాగార్జున రెడ్డి
-నెల్లూరు సిటీ – ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్)
-జీడీ నెల్లూరు – కె నారాయణ స్వామి
-ఎమ్మిగనూరు – బుట్టా రేణుక

ఈ ఆరో లిస్టుతో కలిపి ఇప్పటివరకు 82 స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్ లను వైసీపీ అధినేత జగన్ మార్చేశారు.

Read Also : Tamil Hero Vishal New Party : హీరో విశాల్ కొత్త రాజకీయ పార్టీ?