ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు వైసీపీ ని వీడగా…ఇప్పుడు మరికొంత మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్న జగన్ మోహన్ రెడ్డినే ప్రశ్నించే స్థాయికి కొంతమంది నేతలు వచ్చారు. గతంలో వాయిదా పడిన ఈ నిరసనలను ఫిబ్రవరి 5న నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ కార్యక్రమం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.
NTR Trust : హెల్త్ టిప్స్ అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్
గత ఏడాది కాలంగా కొత్తగా కాలేజీల్లో చేరిన విద్యార్థులకు సమస్యలు తక్కువగా ఉన్నప్పటికీ, పాత విద్యార్థుల బకాయిలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. జగన్ రెడ్డి తన పాలనలో ప్రతి మూడు నెలలకోసారి ఫీజు చెల్లింపుల బటన్ నొక్కుతున్నట్లు ప్రకటించినా, విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. తన పత్రిక సాక్షిలో ప్రకటనలు ఇచ్చినప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం సంక్రాంతికి ముందు రూ. 600 కోట్లు చెల్లించినా, ఇంకా రూ.3,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. వైసీపీ నేతలు ఇప్పుడు ఈ సమస్యను ప్రభుత్వ వైఫల్యంగా చూపించి ఆందోళనలు చేయాలనుకోవడం విశేషంగా మారింది. విద్యార్థుల ఫీజుల కోసం పోరాడుతున్నట్లు చూపించుకోవడం వెనుక వారి అసంతృప్తి కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తాము గతంలో చేసిన తప్పుల వల్ల ఇప్పుడు పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని చాలా మంది నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఈ సమస్యల నేపథ్యంలో కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో వారు కనపడడం లేదు. ముఖ్యంగా, గతంలో విజయసాయిరెడ్డితో దగ్గరగా ఉన్న వారు, ఆయన లేని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధిపత్యాన్ని మిన్నంటించే పరిస్థితిని ఒప్పుకోలేకపోతున్నారు. ఇదే తరహా పరిస్థితి కొనసాగితే, వైసీపీ నుంచి మరికొంత మంది నేతలు బయటకు వెళ్లే అవకాశాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.