Site icon HashtagU Telugu

Krishnam Raju Death Anniversary: ప్రభాస్ కుటుంబంతో వైసీపీ రాజకీయాలు.. రోజా వాగ్దానాలు ఏమయ్యాయి?

Krishnam Raju Death Anniversary

New Web Story Copy 2023 09 12t182457.208

Krishnam Raju Death Anniversary: సినీనటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి ఈ నెల 11వ తేదీతో ఏడాది పూర్తయింది. ఆయనను గుర్తు చేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో కంటతడి పెట్టారు. ‘రెబల్‌స్టార్‌’ మీరు ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా మా గుండెల్లో నిలిచిపోతారు అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో పాటు మరో అంశాన్ని కూడా నెటిజన్లు లేవనెత్తారు. ఏపీ టూరిజంలో అధికార ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇచ్చిన హామీలను గుర్తు చేశారు.

ఏపీ మంత్రి రోజా సంస్మరణ సభలో చెప్పిన మాటలివి. “రాజకీయాల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. ఆ గౌరవం కృష్ణంరాజుకు దక్కింది. సినిమాల్లో రెబల్ స్టార్. బయట సెన్సిటివ్ మైండ్. తన వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రభాస్.. భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. కృష్ణంరాజును ప్రేమించే వారందరికీ అండగా నిలవాలని ప్రభాస్‌ని కోరుతున్నాను. అలాగే పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంతంలో కృష్ణంరాజ్‌ పేరుతో స్మారక చిహ్నం ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించనుంది. ఆయన పేరిట స్మారక వనాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తాం. ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పాం. ఇప్పుడు ఇదే విజయాన్ని ప్రశ్నిస్తూ గోదావరి జిల్లా ప్రజలు రోజాపై విమర్శలు చేస్తున్నారు.

అయితే ప్రభుత్వం కృష్ణంరాజు స్మారక చిహ్నం ఏర్పాటు చేయడాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నిక ల్లో రాజు ఓట్ల కోసమే ఈ ప్రకటన చేశారన్న విమర్శలు విన్పించాయి. మంత్రి రోజా ద్వారా వైసిపి ప్రభుత్వం కృష్ణంరాజు పేరుతో రాజులకు ఎర వేస్తోందని ఆరోపిస్తున్నారు.

Also Read: House Remond rejected : జైలులో చంద్ర‌బాబు ఎన్నాళ్లు..? ఏసీబీ కోర్టులో ఏం జ‌రుగుతోంది.?