Site icon HashtagU Telugu

AP Politics: వైసీపీ పొలిటికల్ థ్రిల్లర్, చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్‌

Mahesh Manjrekar

Mahesh Manjrekar

AP Politics: ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎలక్షన్ హీట్స్ పీక్స్ చేరగా, ఏపీలో కూడా అంతేస్థాయిలో పాలిటిక్స్ చర్చనీయాంశమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తగ్గేదేలే అంటూ టీడీపీ, వైసీపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే టీడీపీ అధినేత స్కిల్ కేసులో అన్యూహంగా అరెస్ట్ కావడం, నారా ఫ్యామిలీ ప్రజల్లోకి రావడం, వైసీపీ వరుస సభలు, సమావేశాలతో దూసుకుపోతుండటం లాంటి పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అధికార పార్టీ వైసీపీ ఇప్పట్నుంచే స్కెచ్ వేసింది.

ఇప్పటికే మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర 2 మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదుగుదలను తెలిపే పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. జగన్‌గా జీవా నటిస్తుండగా, జగన్ తండ్రి వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించారు. ఇక కాగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుగా నటించేందుకు మేకర్స్ మహేష్ మంజ్రేకర్‌ని ఎంచుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది.

టీడీపీ నాయకుడికి సంబంధించిన ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ కాస్టింగ్ వివరాలు టిన్సెల్ పట్టణంలో హాట్ న్యూస్‌గా మారాయి. చంద్రబాబును పోలిన నటుడిని వెతకడం మేకర్స్‌కు మొదట్లో సవాల్‌గా మారింది. ఎట్టకేలకు మహేష్ మంజ్రేకర్ ని ఫిక్స్ చేసుకున్నారు. “నటుడు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీపై టీడీపీ ఏవిధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.