YCP : వైసీసీ మైండ్ గేమ్ ఆడుతుంది – టీడీపీ నేతల కామెంట్స్

ఈసారి ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడంతో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని..ఖచ్చితంగా కూటమి గెలవబోతుందని కూటమి నేతలు చెపుతుంటే..వైసీపీ నేతలు జగన్ సంక్షేమం చూసి ఓటర్లు పోటెత్తారని

  • Written By:
  • Publish Date - May 22, 2024 / 09:02 PM IST

ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వ్త్ర ఆసక్తి నెలకొంది..రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఏపీ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇదే తరుణంలో ఈసారి ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడంతో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని..ఖచ్చితంగా కూటమి గెలవబోతుందని కూటమి నేతలు చెపుతుంటే..వైసీపీ నేతలు జగన్ సంక్షేమం చూసి ఓటర్లు పోటెత్తారని..జూన్ 09 మన వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల కామెంట్స్ ఫై కూటమి నేతలు స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ఫలితాలపై వైసీసీ మైండ్ గేమ్ ఆడుతోందని.. టీడీపీ నేతలు. ఫ్యాన్ పార్టీ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ చేస్తుంటే నవ్వు వస్తుందన్నారు రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాస్ రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయా నేతలు.. ఓటమి భయంతోనే వైసీపీ దాడులు చేయిస్తోందన్నారు. జూన్ 09 న జగన్ ప్రమాణ స్వీకారం అని వైవీ సుబ్బారెడ్డి, బొత్స ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. ప్రమాణ స్వీకారానికి స్టేడియం ఏర్పాట్లు, స్టార్ హోటల్స్ బుక్ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందని, నాలుగుతో దుకాణం క్లోజ్ అవుతుందని గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేసారు. ఉద్యోగస్తులు ఎప్పుడైనా తిరగబడితే ఆ ఎన్నికల్లో అధికార ప్రభుత్వం విజయం సాధించిన సందర్భాలు లేవని రఘురామరాజు అన్నారు. కూటమి 125 సీట్లలో తప్పకుండా విజయం సాధించడం ఖాయమన్నారు.

Read Also : AP Election Counting : కౌంటింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో..?