Aarogyasri : వైసీపీ పార్టీకి మరో పెద్ద చిక్కు వచ్చి పడింది..

ఆరోగ్యశ్రీ కింద మే 4 నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 08:06 PM IST

వైసీపీ (YCP) పార్టీకి వరుస షాకులు , చిక్కులు వచ్చిపడుతూనే ఉన్నాయి. ఎన్నికలకు సరిగ్గా పది రోజుల సమయం కూడా లేకపోవడంతో జగన్ ఇంకాస్త స్పీడ్ చేస్తున్నాడు. ఓ పక్క ప్రత్యర్థి పార్టీలు తమ విమర్శలు , ఆరోపణలతో వైసీపీ ని ఇరుకున పెడుతుండగా..మరోపక్క కోర్ట్ లు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ఎంచేయాలా అని అనుకుంటున్నా తరుణంలో నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి.

ఆరోగ్యశ్రీ (Aarogyasri ) కింద మే 4 నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు లేఖ రాశాయి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాము చికిత్సలు అందించలేక అప్పుల పాలయ్యామని .. శనివారం నుంచి చికిత్సలు నిలిపివేస్తామని లేఖలో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వానికి ఈ విషయంపై విజ్ఞప్తి చేశామని ఇంకా రూ. వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయకపోతే ఆస్పత్రుల నిర్వహణ సమస్యగా మారుతుందన్నారు.

బిల్లులతో పాటు చికిత్సలకు ఇస్తున్న ప్యాకేజీల ధరలు కూడా పెంచాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. పదేళ్ల క్రితం ప్యాకేజీలతోనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని, శస్త్ర చికిత్సల ఛార్జీలు పెంచాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. గత చర్చల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీలిచ్చినా.. బిల్లులు విడుదల చేయలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి. ఇలా హెచ్చరికలు జారీ చేసినప్పుడల్లా చర్చల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం ఆసుపత్రులకు హామీ ఇస్తూ వస్తోంది. కానీ అమలు కావడం లేదన్నారు.

ఇదే విషయాన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తన ప్రచారంలో చెప్పుకొచ్చాడు. ఆరోగ్య శ్రీ కింద పెండింగ్ బిల్లులు చాల ఉన్నాయని..ప్రభుత్వం వాటిని చెల్లించడం లేదని..లక్షల కోట్లు కేంద్రం ఇస్తున్న వాటిని తమ జేబులో పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఈరోజు అదే నిజం అంటూ ప్రవైట్ హాస్పటల్స్ ..ప్రభుత్వానికి రాసిన లేఖ చూస్తే అర్ధం అవుతుంది.

Read Also : Kubera : ధనుష్ ‘కుబేర’ మూవీ నుంచి నాగార్జున ప్రోమో రిలీజ్..